ముట్టుకుంటే అగ్గి పుడుతుంది... బీఆర్ఎస్ మరో సెంటిమెంట్ వార్ !
తెలంగాణలో మరో రాజకీయ యుద్ధానికి తెర లేవనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి.;
తెలంగాణలో మరో రాజకీయ యుద్ధానికి తెర లేవనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి. ఇప్పటికే నీటి విషయంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ ల మధ్య జల జగడం సాగుతోంది. క్రిష్ణ గోదావరి నీటి వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని బీఆర్ఎస్ గట్టిగా విమర్శిస్తోంది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ అసమర్ధంగా వ్యవహరిస్తోంది అని కూడా చెబుతోంది. ఆ వేడి అలా కొనసాగుతుండగానే దానికి జత అన్నట్లుగా మరో ఇష్యూని బీఆర్ ఎస్ చేతుల్లోకి తీసుకునేట్లుగా సీన్ కనిపిస్తోంది.
జిల్లా పునర్విభజన :
తెలంగాణ లో జిల్లాల పునర్ విభజన అన్నది ఇపుడు రాజకీయంగా కాక రేపేలా కనిపిస్తోంది. తెలంగాణాలో 33 జిల్లాలు ఉన్నాయి. వాటి విషయంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ జిల్లాలను తగ్గించాలని శాస్త్రీయ దృక్పధంతో రూపురేఖలు తీసుకుని రావాలని ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది దాని మీద అధికార ప్రకటన కూడా వెలువడింది. ఇక రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కేసీఆర్ ఏలుబడిలో జిల్లాల విభజన అన్నది పూర్తి అసాశ్త్రీయంగా సాగింది అని విమర్శించారు. అందుకే తాము అవసరమైన మేర్కు జిల్లాలను తగ్గించి అవసరం లేని వాటిని తొలగిస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఇపుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది.
అగ్గి పుట్టిస్తామంటూ :
జిల్లాల విషయంలో ఏమైనా తేడా పాడా చేయాలనుకున్నా వాటి జోలికి వచ్చినా అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తెలంగాణాలో అగ్గి పుట్టించే ఈ బాధ్యతను కూడా బీఆర్ ఎస్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేయడం విశేషం. తాజాగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ సర్పంచులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
కేసీఆర్ చేసింది రైటు :
అంతే కాకుండా కేసీఆర్ చేసింది రైటు అని కేటీఆర్ చెప్పడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాలు ఆనాటికి ఉండేవని వాటిని 31గా చేశారు అని ఇదంతా పాలనాపరమైన సౌకర్యం కోసమే అని ఆయన చెప్పారు. అలాగే పెద్ద జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ని నాలుగు జిల్లాలుగా చేశారని ఆయన గుర్తు చేశారు ఇల తండాలలో పాలన వారికే ఉండాలని తండాల వాసుల చేతిలో పాలన పెట్టేందుకు వాటిని గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కూడా కేసీఆర్ దే అని ఆయన నొక్కి చెప్పారు.
వారంతా ఊరుకుంటారా :
జిల్లాలను తాము పెంచామని కొత్తగా అనేక ప్రాంతాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఇపుడు కొత్త జిల్లాలను తీసేస్తే వారు ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక కొత్త జిల్లాల విషయంలో ఏది ముట్టుకున్నా అగ్ని గుండమే అవుతుందని కూడా అంటున్నారు. జిల్లాల జోలికి దయచేసి రావద్దు అని ఆయన అ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ కనుక వస్తే మాత్రం ఉద్యమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఇవన్నీ పిచ్చి పనులుగా పొరపాట్లుగా కేటీఆర్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే పార్లమెంట్ సీట్ల ప్రాతిపదికన మొత్తం 33 జిల్లాలను 17 జిల్లాలుగా కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నది ప్రచారంలో ఉంది. అయితే అలా చేస్తే తాము ఉద్యమిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.