కారు కంపెనీలకు ఎయిర్ బ్యాగ్స్ రూల్
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర సర్కారు నడుం బిగించింది. ప్రతి ఏటా వేలాది మంది మృత్యువుపాలు కావటానికి కారణమైన రోడ్డు ప్రమాదాల్ని విశ్లేషిస్తే.. కారు ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవటం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు.
కారులో ఎయిర్ బ్యాగ్స్ కానీ ఉంటే.. చాలా ప్రమాదాల్లో మృతి చెందే అవకాశం ఉండదని తేల్చారు. అయితే.. ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యం ఉన్న కార్ల ధరలు భారీగా ఉండటం.. మధ్యతరగతి జీవులు ఎయిర్ బ్యాగ్ ఉన్న కార్లను ఎంపిక చేసుకోకుండా ఉంటున్నాయన్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో కార్లు అమ్మే ప్రతి కంపెనీ.. తాను అమ్మే ప్రతి కారులోనూ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి అన్న నిబందనను చేర్చనున్నట్లు చెబున్నారు. కార్ల కంపెనీలకు ప్రభుత్వం సూచించే ప్రమాణాల్లో ఎయిర్ బ్యాగ్స్ ఉండాలన్న రూల్ పక్కాగా అమలు చేయాలని చెప్పనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎయిర్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీల్ని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు.
భారత్ లో కార్ల పరిశ్రమకు సానుకూల వాతావరణం ఉండటం.. ఎయిర్ బ్యాగ్స్ ప్రతి కారులోనూ ఏర్పాటు చేయాలన్న రూల్ పెట్టేస్తే.. ఈ రంగానికి ప్రోత్సాహకరంగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో.. ప్రమాద సమయాల్లో మరణాల సంఖ్య కనీస స్థాయికి తగ్గిపోతుందని చెబుతున్నారు. మరి.. కేంద్రం ఎయిర్ బ్యాగ్స్ రూల్ ని ఎప్పడు తెర మీదకు తెస్తుందో..?