భారత్ అస్త్రం: టెర్రరిస్టుల పాలిట యమపాశం
టైర్లతో పరిగెత్తగలదు.. ఇసుక - ఎడారి - నీరు వచ్చినప్పుడు టైర్లు దిగబడకుండా లోపలికి వెళ్లిపోయి ఇనుప చక్రాలు బయటకు వస్తాయి. ఇలా రెండు రకాలుగా ప్రయాణించగలదు.. పరుగులు తీయగలదు.. ఇక బాంబులు పడ్డా.. గ్రేనెడ్లు తాకినా.. బుల్లెట్ల వర్షం కురిసినా ఈ వాహనానికి ఏమీ కాదు.. మొత్తం ముగ్గురు సైనికులు ప్రయాణించే ఈ అతిచిన్న వాహనం శత్రు దుర్భేధ్యం.. నగరాల్లో - పాత ఇళ్లల్లో నక్కి కాల్పులు జరిపే ఉగ్రవాదులను ఈ బుల్లి వాహనంలో వారి వద్దకు వెళ్లి మరీ దాడులు చేసి చంపడానికి భారత రక్షణ పరిశోధన సంస్థ ఈ అద్భుత యాంటి టెర్రరిస్ట్ వాహనాన్ని తయారు చేసింది. ఈ వాహనం ఇప్పుడు ఆర్మీ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా మారనుంది.
విదేశాల నుంచి ఇన్నాళ్లు దిగుమతి చేసుకునే యాంటీ టెర్రరిస్టు వెహికల్స్ కు ప్రత్యామ్మాయంగా భారత రక్షణ - పరిశోధన - అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) దేశీయంగా తయారు చేసిన ఈ కొత్త యాంటి టెర్రరిస్ట్ వెహికల్ ఇప్పుడు భారత ఆర్మీకి కొండంత బలంగా మారింది.
ముఖ్యంగా వివిధ నగరాలు - పట్టణాలు - సరిహద్దుల్లోని ఇళ్లల్లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత్ శాస్త్రవేత్తలు ఈ వాహనాన్ని తయారు చేశారు. ఇందులో ముగ్గురు సైనికులు ప్రయాణించవచ్చు. ఒకరు వాహనం నడిపితే మరో ఇద్దరు కాల్పులు - ఆపరేషన్ నిర్వహించవచ్చు. దీని బరువు మూడు టన్నులు.. చిన్న సైజు ఆయుధాలు - హ్యాండ్ గ్రెనైడ్లు మోసుకెళ్లగలదు. ఇరుకుగా ఉండే రహదారులు - అపార్ట్ మెంట్ల మధ్య సునాయాసంగా ప్రయాణించగలదు. అతి తక్కువ స్థలం ఉన్నా ఇది 360 డిగ్రీల కోణంలో చుట్టు తిరిగేలా తయారు చేశారు. దీంతో ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎటువైపు నుంచి వచ్చినా చంపేయగలదు.
ఇక దీనిపై ఎన్ని బాంబులు వేసినా.. గుళ్ల వర్షం కురిపించినా లోపలున్న సైనికులకు ఏమీ కాదు.. మొత్తం బుల్లెట్ - బాంబ్ ప్రూఫ్ గా తయారు చేశారు. తక్కువ శబ్ధంతో ప్రయాణిస్తున్నారు. ఆరు ఫైరింగ్ పోర్టుల ద్వారా కాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమారుస్తుంది.
ఇక అత్యవసర సమయాల్లో ఇందులోని సైనికులు బయటకు రావడానికి పైకప్పును తీసుకొని బయటకు దూకేయవచ్చు. 26/11 ఉగ్రవాద దాడుల్లో వందల మంది ప్రాణాలు పోయాక ఉగ్రవాదుల వద్దకు వెళ్లి చంపడానికి భారత పరిశోధన సంస్థ ఎంతో శ్రమకోర్చి దీన్ని తయారు చేసింది. దీంతో ఈ సరికొత్త వాహనం టెర్రరిస్టుల పాలిట యమపాశంగా మారనుంది.