మైలవరం సెంటిమెంట్ మళ్లీ రిపీటైతే... !
మైలవరం.. టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. గతంలో దేవినేని ఉమా విజయం దక్కించుకుని మంత్రి అయ్యారు.;
మైలవరం.. టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. గతంలో దేవినేని ఉమా విజయం దక్కించుకుని మంత్రి అయ్యారు. 2019లో వైసీపీ ఇక్కడ తొలిసారి పాగా వేసింది. ఇక, 2024లో మళ్లీ ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. 2019లో వైసీపీ తరఫున గెలిచిన వసంత కృష్ణప్రసాద్ 2024లో టీడీపీలో చేరి పసుపు కండువాతో ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే.. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంటు కొనసాగుతోంది. ఒక నాయకుడిని రెండు సార్లకు మించి.. ఇక్కడి ప్రజలు గెలిపించిన సందర్భం లేదు. పార్టీ ఏదైనా.. కూడా ఒక నేతను రెండు సార్లు గెలిపించిన ప్రజలు.. మూడోసారి ముచ్చటగా.. కొత్తవారికి పట్టం కట్టారు. అయితే.. ఇందులోనూ రెండు కోణాలు ఉన్నాయి. అయితే.. పార్టీలు.. లేకపోతే నాయకులు ఎవరైనా.. ఏదైనా కూడా వరుసగా రెండు సార్లకు మించి ఇక్కడ విజయం దక్కించుకోలేదు.
ఉదాహరణకు 1985, 1989 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లు కురిపించారు. తద్వారా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన నాయకులతో సంబంధం లేకుండా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత.. 1994, 1999 ఎన్నికల్లోనూ ఇదే పరంపర కొనసాగింది. అప్పట్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కించారు ఇక్కడి ప్రజలు. కానీ.. ఆ తర్వాత.. పరిస్థితి మారిపోయింది. నాయకుల రాజకీయం, సామాజిక వర్గాల ప్రభావం కనిపించడం ప్రారంభమైంది.
2009, 2014 ఎన్నికల్లో నాయకుల కేంద్రంగా ఎన్నికలు సాగాయి. దీంతో పార్టీతో సంబంధం ఉన్నా లేకు న్నా దేవినేని ఉమా మహేశ్వరరావును వరుసగా రెండుసార్లు.. విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. కూడా ఇదే పరంపర కొనసాగింది. 2019, 2024 ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ వరుసగా విజయం దక్కిం చుకున్నారు. ఇక, నెక్ట్స్ పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇదే సెంటిమెంటు రిపీట్ అయితే.. వచ్చే ఎన్నికల్లో నాయకత్వ మార్పు దిశగా నియోజకవర్గం అడుగులు వేసే అవకాశం ఉంటుంది. మరి ఆ సెంటిమెంటు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారా.. లేదా? అనేది చూడాలి.