వైసీపీలో చెవిరెడ్డి మాట చెల్లుతోందా...ఒకటే చర్చ ?
వైసీపీలో కోటరీ అంటూ అప్పట్లో చాలా సార్లు మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కోటరీలో ఉన్న వారే మీద ఆయన ఆయన విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.
వైసీపీలో కోటరీ అంటూ అప్పట్లో చాలా సార్లు మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కోటరీలో ఉన్న వారే మీద ఆయన ఆయన విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కోటరీ అంటే ఏమో కానీ వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ అధినేతకు అన్నీ తానే అన్నట్లుగా ఉంటారు అని కూడా చెబుతారు. ఆయనే పార్టీ విధానపరమైన నిర్ణయాలను ఆయన ప్రభావితం చేస్తారు అని కూడా ప్రచారం చేస్తూంటారు. చాలా కాలంగా సజ్జల మాట వైసీపీలో చలామణీ అవుతోంది అని అంటున్న వారు ఉన్నారు. అయితే ఇపుడు సజ్జల ప్లేస్ లో లేదా ఆయన పక్కన మరో సీనియర్ నేత వచ్చి చేరారు అని ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు అంటే ఆయనే తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అంటున్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా :
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డిని 2024 ఎన్నికల్లో రాజకీయాల్లోకి దించారు. తాను ఒంగోలు నుంచి ఎంపీగా చివరి నిముషంలో పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో తండ్రీ కొడుకూ ఓడిపోయారు. ఇక ఆ మధ్య ఆయనను లిక్కర్ కేసులో అరెస్టు చేసి జైలులో కొన్నాళ్ళు ఉంచారు. జైలు నుంచి బయటకు వచ్చాక చెవిరెడ్డి తన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటున్నారు అని ప్రచారం సాగుతోంది.
పార్టీ కార్యక్రమాలతో :
వైసీపీ కార్యక్రమాలను అన్నీ తానే చూస్తూ చెవిరెడ్డి జగన్ వద్ద మెప్పు సంపాదించారు అని అంటున్నారు. అంతే కాదు వైసీపీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి నివేదికలను తీసుకోవడం వాటిని జగన్ కి అందించడం వంటివి కూడా చెవిరెడ్డి చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీ ఎక్కడ ఎలా పనిచేస్తుందో అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు జరిగేలా చూడడం వంటి ముఖ్య బాధ్యతలను కూడా చెవిరెడ్డి తన భుజాల మీద వేసుకుని గట్టిగా పనిచేస్తున్నారు అని అంటున్నారు.
ఆ ప్రొగ్రాం హిట్ అంటూ :
ఇక చూస్తే కూటమి రెండేళ్ళ పాలన మీద వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు హిట్ అయ్యాయని దానికి కారణం చెవిరెడ్డి రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ అని ఆయన అనుచరులు చెబుతున్నారు. తమ నాయకుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చోట్ల వైసీపీ బాధ్యులతో పార్టీ నేతలతో ఎప్పటికపుడు మాట్లాడుతూ అలెర్ట్ చేస్తూ పరుగులు పెట్టించడం వల్లనే ఆ కార్యక్రమం అంతలా హిట్ అయింది అని అంటున్నారు. ఆ విధంగా జగన్ వద్ద మంచి మార్కులు చెవిరెడ్డి సంపాదించారు అని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే సజ్జల పార్టీలో ఈ రోజుకీ కీలకమైన స్థానంలోనే ఉన్నారు. వైసీపీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రకటనలు కానీ ఆయనే మాట్లాడుతూ ఉంటారని గుర్తు చేస్తున్నారు.
వైసీపీలో చెవిరెడ్డి జోరు :
మరి సజ్జల ఒక వైపు ఉంటే చెవిరెడ్డి మరో వైపునా అన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరూ కోటరీనా అని కూడా అంటున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి అధినాయకత్వానికి దగ్గర అన్నది మరో చర్చ. ఏది ఏమైనా చెవిరెడ్డి మాత్రం ఇక తన రాజకీయ జీవితం వైసీపీ అధినాయకత్వానికి దగ్గరగా ఉంటూ కొనసాగించాలని భావిస్తున్నారు అని అంటున్నారు. మరి చెవిరెడ్డి జోరు వైసీపీలో సాగుతోందా ఏమిటి అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అని పార్టీలో చెప్పుకుంటున్నారట.