కులాల రాజ‌కీయం వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. !

రాష్ట్రంలో కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్న జ‌న‌సేన.. ఈ విష‌యంలో ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? ఎలా ముందుకు సాగుతుంద‌న్న‌ది ఇప్ప‌టికీ సంక్లిష్టంగానే మారింది.

Update: 2026-07-13 18:30 GMT

రాష్ట్రంలో కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్న జ‌న‌సేన.. ఈ విష‌యంలో ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? ఎలా ముందుకు సాగుతుంద‌న్న‌ది ఇప్ప‌టికీ సంక్లిష్టంగానే మారింది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ రూపొందిస్తామ‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌లేదు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు మొత్తం కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. వీటిని ఛేదించి.. కులాల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయడం సాధ్యం అయితే .. అది నిజంగానే రికార్డు అవుతుంది.

ఏం చేయాలి.. ?

దేశంలో ప్ర‌స్తుతం కులాలు, మ‌తాల ఆధారంగానే రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీనికి ఎవ‌రూ అతీతం కాదు. ఏ పార్టీ అయినా.. ఇలానే లెక్క‌లు వేస్తోంది. కులాల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తోంది. ఇప్పుడు జ‌న‌సేన దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. తొలి మెట్టుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన అవ‌సరం ఉంటుంది. ముఖ్యంగా కులాల‌కు అతీతంగా టికెట్లు ఇచ్చే సంప్ర‌దాయానికి తెర‌దీయాలి. అప్పుడు పార్టీపై భ‌రోసా ఏర్పడుతుంది.

2) కులాల ప్రాతిప‌దిక‌న ఉన్న ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో జ‌న‌సేన నిర్ణ‌యం తీసుకోవాలి. ఉదాహ‌ర‌ణకు బీసీల‌కు ఇచ్చే ఉచిత ప‌థ‌కాల విష‌యంలో అన్ని వ‌ర్గాల‌కు ఇస్తారా? అనేది తేల్చుకోవాలి. అప్పుడు స‌హ‌జంగానే బీసీల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌న్న భ‌యం ఉంటుంది.దీనిని లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగితే.. ప‌ట్టు పెంచుకునే మార్గాలు అన్వేషించాలి.ఈ క్ర‌మంలో బీసీలు కోరుకుంటున్న రాజ్యాధికారం దిశ‌గా జ‌నసేన అడుగులు వేయాలి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మో ఆలోచించాలి.

3) ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో మార్పు తీసుకురావ‌డం: ఇది జ‌న‌సేన పార్టీకి అత్యంత కీల‌కం. ప్ర‌స్తుతం కులాల వారీగా ఏర్ప‌డిన స‌మాజంలో కుల ర‌హిత రాజ‌కీయాలు చేసే దిశ‌గా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆదిశ‌గా పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డ‌పాల‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యం గా త‌ట‌స్థ ఓటు బ్యాంకును క‌నుక సొంతం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తే.. అప్పుడు కులాల‌కు అతీత మైన రాజ‌కీయాల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఇదంత తేలిక‌గా అయ్యేది కాద‌ని.. ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News