పున‌ర్విభ‌జ‌న ఎఫెక్ట్‌.. సామాజిక వర్గాల‌ను సంతృప్తి ప‌రిచేదెలా..!

సామాజిక వ‌ర్గాల ప‌రంగా రాజ‌కీయాలు చీలిపోతున్నాయి. ప్ర‌జ‌ల్లోనూ ఈ త‌ర‌హా మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.;

Update: 2026-04-08 00:30 GMT

సామాజిక వ‌ర్గాల ప‌రంగా రాజ‌కీయాలు చీలిపోతున్నాయి. ప్ర‌జ‌ల్లోనూ ఈ త‌ర‌హా మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సామాజిక వ‌ర్గాల ప‌రంగా పార్టీలు త‌మ‌కు చేస్తున్న మేలు,.. అందిస్తున్న ప్ర‌యోజ‌నాల ను వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వాస్త‌వానికి పార్టీలు అంత‌ర్గ‌తంగానే కులాల వారీగా టికెట్ల‌ను కేటాయిస్తున్న ప‌రిస్థితి ఉంది. దీనినిఆయా వ‌ర్గాలు స‌ర్దుకు పోతున్నాయి. పార్టీలు ఒక్కొక్క‌సారి స‌మాజం లో ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఎక్కువ‌.. మ‌రికొన్నింటికి త‌క్కువ‌గా సీట్లు ఇస్తున్నాయి.

అయితే.. ఇప్పుడు సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా పెరుగుతున్న చైత‌న్యం.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా పెరుగుతు న్న ఆకాంక్ష‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. పార్టీల‌కు ఇప్పుడు టికెట్ల జంఝాటం పెరుగుతోంది. ఉదాహ ర‌ణ‌కు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాను తీసుకుంటే.. బోయ సామాజిక వ‌ర్గం పెద్ద ఎత్తున ఇక్క‌డ ఉంది. వీరు గ‌త కొన్నాళ్లుగా ఎస్టీ హోదా కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక‌, చిత్తూరు జిల్లాలో రెల్లి కుల‌స్తులు ఎక్కు వ‌గా ఉన్నారు. వీరు వ్య‌వ‌సాయం, మేద‌ర ప‌నులు చేసుకుంటున్నారు.

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో వైశ్య సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. వీరు కూడా రాజ‌కీయంగా చైత‌న్యం అవుతు న్నారు. ఇక‌, ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో కేవ‌లం కాపులే కాకుండా.. అంత‌ర సామాజిక వ‌ర్గాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. ఇలా.. జిల్లాకు ఒక విధంగా కొన్ని కొన్ని సామాజిక వ‌ర్గాలు త‌మ‌కు రాజ‌కీయంగా ప‌ద‌వుల ప‌రంగా ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని భావిస్తున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య ప‌రిమితంగా ఉండడం.. ఉన్న‌వాటికే పోటీ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో స‌ర్దుకు పోతున్నారు.

కానీ.. త్వ‌ర‌లోనే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కార‌ణంగా రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య మెరుగైన సంఖ్య‌లో పెర‌గ‌నుంది. దీంతో త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆయా సామాజిక వ‌ర్గాల వారు ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు మండ‌లానికి.. ప‌ట్ట‌ణాల‌కు ప‌రిమిత‌మైన వారు.. ఆయా సామాజిక వ‌ర్గాల క‌మిటీల‌కు నేతృత్వం వ‌హిస్తున్న‌వారు.. ఈ డిమాండ్ల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. దీంతో ఇది అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయా సామాజిక వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌ర‌చాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా టికెట్ల కేటాయింపు పార్టీలకు క‌త్తిమీద సాములా మార‌నుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News