భారత్ లో హిందువులదే ఆధిపత్యం...కానీ, ముస్లింలు సంతోషంగా ఉన్నారు:భగవత్
ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత సంతోషంగా భారత దేశంలోని ముస్లింలు ఉన్నారరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి హక్కులే ఉండవని, కానీ, భారత్ లో ముస్లింలతో సహా అన్ని మతాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. భారతదేశ సంస్కృతిపై దాడి జరిగిన సందర్భంలో, దేశ ప్రతిష్టకు భంగం కలిగిన ప్రతి సారీ అన్ని మతాల ప్రజలు ఏకతాటిపై నిలబడ్డారని, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకున్నారని ఆయన అన్నారు. మన దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మన భారత రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని, ఇక్కడ అందరూ ఉండొచ్చని, కానీ భారత్ లో ఉండాలంటే మాత్రం హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని భగవత్ అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి వేర్పాటు వాదాన్ని కొందరు ప్రోత్సహిస్తున్నారని, అటువంటి వారితోనే దేశ సమగ్రతకు భంగం కలుగుతోందని భగవత్ అన్నారు.
`వివేక్` అనే హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మన దేశంలో అందరూ సమానులేనని, మనమంతా భారతీయులమని మోహన్ భగవత్ అన్నారు. కానీ, భారత్ లో నివసించే ముస్లింలు, మిగతా మతస్థులు కచ్చితంగా భారతీయ సంస్కృతిని గౌరవించాలని, భారత్ లో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని భగవత్ అన్నారు. గతంలో దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగినపుడు భారతీయులంతా ఏకమయ్యారని, అదే భారతీయ సంస్కృతి గొప్పదనమని చెప్పారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ పై మహారాణా ప్రతాప్ చేసిన పోరాటంో చాలా మంది ముస్లిం సైనికులు రాణా ప్రతాప్ కు మద్దతుగా యుద్ధం చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ దేశం ముస్లింలకు ఇవ్వనంత గౌరవాన్ని భారత్ ఇస్తోందని, అందుకే భారత్ లో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.
ఒక దేశాన్ని పాలించిన మతం వారు తమ పాలన అంతమైన తర్వాత కూడా అదే దేశంలో సంతోషంగా ఉండడం కేవలం భారత్ లోనే సాధ్యమని ముస్లింలను ఉద్దేశించి అన్నారు. అందుకే, మన దేశంలో ముస్లింలు ఉన్నంత సంతోషంగా మరే దేశంలోని ముస్లింలు లేరని చెప్పారు. అదే భారత దేశ వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనమని అన్నారు. మొఘలుల పాలనలో ఎన్నో హిందూ దేవాలయాలు నాశనం అయ్యాయని, అందుకే ఎన్నో ప్రాచీన హిందూ దేవాలయాలను పునర్నిర్మించాల్సిన అవసరముందని భగవత్ చెప్పారు. మన దేశంలో అయోధ్య రామమందిరం వంటి ఎన్నో హిందు దేవాలయాల నిర్మాణాలు జరగాల్సి ఉందని భగవత్ అన్నారు. రామ మందిరం జాతీయ విలువలకు, స్వభావానికి ప్రతీక అని అన్నారు.