ఏడాదిలో అంత భారీగా తిరుమల శ్రీవారి దర్శనాలు

గత ఏడాది జూన్ లో శనివారాల్లో సగటున 90-95 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.;

Update: 2026-04-12 06:30 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2025-26లో భక్తులు ఎంత భారీగా స్వామి వారిని దర్శించుకున్నారన్న లెక్కలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంతో పాటు.. పక్కా ప్లానింగ్ తో భారీగా వస్తున్న భక్తులకు తగ్గట్లు దర్శనాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లుగా చెప్పాలి. 2023-24, 2024-25లో రోజుకు సగటున 70 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 2025-26లో మాత్రం అందుకు భిన్నంగా రోజుకు 73 వేలమంది భక్తులు దర్శించుకోవటం గమనార్హం.

గత ఏడాది జూన్ లో శనివారాల్లో సగటున 90-95 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏడాదశి సందర్భంగా పది రోజుల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అదనంగా 1.40 లక్షల మంది స్వామి వారి దర్శనం చేసుుకోవటం గమనార్మం. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ.. క్యూలైన్లలో భక్తులు రద్దీ.. కంపార్ట్ మెంట్ల వెయింటింగ్ సమాయాన్ని చూసి.. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేలా.. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శనం జరిగేలా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు.

దీంతో స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. సాధారణంగా స్వామి వారిని దర్శించుకునే భక్తుల రద్దీ జులై.. ఆగస్టులో ఉంటుంది. ఆ నెలల్లోనే స్వామి వారి హుండీ ఆదాయం రూ.120 కోట్లు దాటుతుంది. కానీ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఆర్నెల్లు హుండీ ఆదాయం.. ప్రతి నెలా రూ.120 కోట్లకు పైగా నమోదు కావటం విశేషం.

మొత్తంగా ఏడాదిలో హుండీ ఆదాయం ర.1420 కోట్లకు దాటింది. లడ్డూ విక్రయాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2024-25లో 12.49 కోట్ల లడ్డూలు అమ్మగా.. 2025-26లో 13.95 కోట్ల లడ్డూ అమ్మకాలు సాగాయి. 2023-24లో రోజుకు సగటున 1.87 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా.. 2024-25లో సగటున రోజుకు 2.21 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించారు.

2025-26లో ఈ సంఖ్య ఏకంగా 2.85 లక్షలకు చేరుకోవటం విశేషం. బంగారు.. వెండి డాలర్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2024-25లో బంగారు డాలర్ల అమ్మకాలతో రూ33.88 కోట్లు.. వెండి డాలర్ల అమ్మకాలతో రూ.2.7 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26లో ఈ ఆదాయం రూ.56.10 కోట్లు (బంగారు డాలర్ల అమ్మకాలపై) రూ.5.22 కోట్లు (వెండిడాలర్ల అమ్మకాలపై) ఆదాయం స్వామి వారికి సమకూరింది. స్వామికి వచ్చే ఆదాయాల్లో పెద్ద ఎత్తున పెరుగుతోంది.. బంగారు, వెండి డాలర్ల అమ్మకాల మీదనే కావటం గమనార్హం.


Tags:    

Similar News