ఇప్పుడు నవయుగ వంతు!
తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు - సానుభూతిపరులపై భారతీయ జనతా పార్టీ మూడో కన్ను తెరుస్తోంది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సానుకూలరపై ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులు చేయించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన దాడులను మరింత ముమ్మరం చేసిందంటున్నారు. గురువారం నాడు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ లోనూ - హైదరాబాద్ లోనూ పలువురి ఇళ్లు - కార్యాలయాలపై దాడులు చేసింది. ఇందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ కనస్ట్రక్షన్ పై తన గురిని తిప్పింది. హైదరాబాద్ లోని నవయుగ కార్యాలయాలతో పాటు నవయుగకు చెందిన దాదాపు 47 కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసింది.చ దీంతో తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్న వారికి ఓ ఝలక్ ఇచ్చినట్లు అయ్యిందంటున్నారు. గురువారం ఉదయం దాదాపు 20 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు నవయుగ కార్యాలయాలకు వచ్చారు. అక్కడే ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 6 హార్డ్ డిస్క్ లను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పోలవరం కాంట్రక్ట్ దక్కించుకున్న నవయుగ కంపెనీ గడచిన నాలుగు సంవత్సరాలుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ - ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు నవయుగ కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ సోదాల్లో భాగంగా ఆ వివరాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ - నవయుగ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ - కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ - కృష్ణాపోర్ట్ కంపెనీ లిమిటెడ్ - శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ - నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తో పాటు - నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ - నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలన్నింటిపైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు కన్ను వేశారంటున్నారు. మరోవైపు బుధవారం నాడు సీబీఐలో జరిగిన కీలక మార్పులు, అధికారులను తప్పించడం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు.ఇది జరిగి ఇంకా 24 గంటలు గడవక ముందే నవయుగ కంసెనీలపై దాడులు - ఆంధ్రప్రదేశ్ లో పలువురి ఇళ్లపై ఆదాయ శాఖ దాడులు చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం ఉందనేందుకు ఇవి తార్కాణాలు అంటున్నారు.