ఇమిగ్రేషన్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం దిశగా..

Update: 2020-07-12 04:45 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో విదేశీయులను వెళ్లగొట్టేదాకా నిద్రపోడేమో అన్నట్టుగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే హెచ్1బీ సహా అన్ని వర్కింగ్ వీసాలను డిసెంబర్ వరకు రద్దు చేసిన ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.

ప్రతిభ ఆధారంగా ఇమిగ్రేషన్ ఆర్డర్ తీసుకొచ్చే అంశం పై ట్రంప్ దృష్టిసారించినట్టు వైట్ హౌస్ తెలిపింది. ఈ ప్రతిభ ఆధారిత వలస విధానం తీసుకొస్తే అత్యధికంగా నష్టపోయే విదేశీయుల్లో భారతీయ సంతతి పిల్లలే ఎక్కువగా ఉంటారని తెలుస్తోంది.

తల్లిదండ్రులతో అమెరికా వచ్చి ప్రభుత్వపరమైన డీఏసీఏ రక్షణ పొందుతున్న విదేశీయుల పిల్లలు విద్య, ఉద్యోగాల్లో కోత విధించేలా ట్రంప్ చెక్ చెప్పబోతున్నారని తెలిసింది. ఈ విధానాన్ని తేబోతున్నట్టు సమాచారం. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎక్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తానని ట్రంప్ స్వయంగా తెలిపారు.

అమెరికాకు వెళ్లిన విదేశీయులతోపాటు వారి పిల్లలకు ఆదేశంలో స్వేచ్చగా నివసించేందుకు.. ఉద్యోగాలు చేసుకునేందుకు గత ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. 2012 ఒబామా హయాంలో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ దీనిని రద్దు చేయడం ద్వారా ఎక్కువ ప్రభావం భారతీయులపైనే పడనుంది. అలా వెళ్లిన విదేశీయుల్లో 7 లక్షల మంది వరకు భారతీయులే ఉంటారని తెలిసింది. దీంతో ట్రంప్ వలసవాదులకే కాదు.. వారి పిల్లలకు అమెరికాలో ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని అర్థమవుతోంది.
Tags:    

Similar News