శవాల్ని వదలని మార్చురీ అటెండర్.. ఇదేం కక్కుర్తి బాబోయ్
కృష్ణా జిల్లా మంచిలిపట్నంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మనుషులపై మానవత్వం చూపించాల్సింది పోయి , ఇదే సమయం ఇంతకంటే మంచి సమయం రాదు అనుకోని .. కరోనా భాదిత కుటుంబాలపై పడి పీక్కుతింటున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో ఉంటే .. వారితో బేరాలకి దిగుతున్నారు. తాజాగా స్పత్రి మార్చురీలో మృతదేహాన్ని అప్పగించడానికి ఓ అటెండర్ లంచం డిమాండ్ చేశాడు. డెడ్ బాడీని ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కూతురు చనిపోయి బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు, కూతురి డెడ్ బాడీ కోసం లంచం ఇవ్వక తప్పలేదు.
ఈనెల 21 వ తేదీన ఓ యువతి తన భర్త చేతిలో హత్య చేయబడింది. ఆమె మృతదేహానికి మచిలీపట్నంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం పూర్తయ్యాక యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు అక్కడ పనిచేస్తున్న అటెండర్ రూ.6వేలు డిమాండ్ చేశాడు. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం, ఆ బాధను దిగమింగుకొని అంత డబ్బు ఇవ్వలేమని బతిమాలినా వినలేదు.. డబ్బులు ఇవ్వందే అప్పగించేది లేదన్నాడు. చివరకు రూ.1500 ఇచ్చారు. అయితే, అక్కడే ఉన్న బంధువులు డబ్బులు ఇస్తున్న దృశ్యాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. లంచం తీసుకున్న అటెండర్ పై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.