రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇస్తే.. తర్వాతేమవుతుంది?
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం హాట్ హాట్ గా సాగటం.. కేంద్రం కీ రోల్ ప్లే చేయటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంట్రోల్ చేసే విషయంలో అంచనాకు మించినట్లే వ్యవహరించారని చెప్పక తప్పదు. తాము అనుకున్నట్లే.. ఇద్దరు ముఖ్యమంత్రుల చేత కొన్ని అంశాలను ఒప్పుకునేలా చేశారు. అంతేకాదు.. పలు సందర్భాల్లో కేంద్రానికి ఉన్న హక్కులు.. అధికారాల్నిసందర్భానికి తగినట్లుగా సున్నితంగా ప్రస్తావించటం చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కడుతున్న కొత్త ప్రాజెక్టుల అభ్యంతరాలపై సీఎంలు కేసీఆర్.. జగన్ ల మధ్య వాదనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ లు సమర్పించాల్సిందిగా కోరారు. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఓకే చెప్పారు. ఆలోచించి చెప్పారో లేదంటే అంతగా ఆలోచించకుండా సరే అనేశారో తెలీదు కానీ.. డీపీఆర్ ల సమర్పణతో కొత్త చిక్కులు తప్పవంటున్నారు పులువురు నిపుణులు.
దీనికి కారణాలు లేకపోలేదు. ఏ రాష్ట్రమైనా తన ప్రయోజనాలకు తగ్గట్లు ప్రాజెక్టుల్ని సిద్ధం చేసుకుంటారే తప్పించి.. రూల్ బుక్ లోని అంశాల్ని మీరకుండా ఉండే అవకాశం లేదు. ఎక్కడి దాకానో ఎందుకు.. కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. ఏపీ కూడా తక్కువేం కాదు. ఇప్పుడు తల పెట్టిన రాయలసీమ ఎత్తి పోతల వ్యవహారం ఈ కోవ లోకే వస్తుంది.
నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టు లు నిర్మించటానికి ఇటు బోర్డులు.. అటు కేంద్రం అనుమతులు ఇవ్వదు. డీపీఆర్ లు ఇవ్వటం ద్వారా లాకర్ తాళం చెవిని ఇచ్చేసినట్లే. దీంతో.. రూల్ బుక్ ప్రకారం లెక్క చూస్తే.. ఇవి అక్రమ ప్రాజెక్టులుగా గుర్తించటం చాలా ఈజీ. అదే జరిగితే.. ప్రాజెక్టులు ఆగటమో.. లేదంటే వాటికి రావాల్సిన రుణాలు నిలిచిపోవటమో జరుగుతాయి. అదే జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందే. మరి..ఈ లెక్క గురించి ఇద్దరు ముఖ్యమంత్రులకు ఐడియా లేదా? మాంచి హీట్ లో ఉండి కేంద్రమంత్రి చెప్పిన దానికి సరే అన్నారా? అన్నదిప్పుడు ప్రశ్న గా మారింది.