ఉమ్మితే..అటెంప్ట్ టు మర్డర్ కేస్!!

Update: 2020-04-06 16:00 GMT
ప్రపంచంలో కరోనా మారణహోమం చూస్తున్నా కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అతి తక్కువ కేసులతో... రెండో దశలో ఆగిపోవాల్సిన భారతదేశం కొందరు మూర్ఖుల వల్ల మూడో దశలోకి వెళ్లే ప్రమాదం ముందుకు వచ్చింది. మరోవైపు తబ్లిగి జమాత్ సమావేశం ఈ దేశాన్ని పెద్ద అపాయంలోకి నెట్టింది. వేలమందికి అక్కడ కరోనా సోకడం - వారు దేశ వ్యాప్తంగా కరోనాను తమ తమ రాష్ట్రాలకు మోసుకెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇలా మర్కజ్ వ్యవహారానికి బలైన రాష్ట్రాల్లో తమిళనాడు - ఆంధ్ర - తెలంగాణ - హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలున్నాయి.

దీన్ని ఎలా ఆపాలో సర్వశక్తులు ఒడ్డి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్దేశ పూర్వకంగా బాధ్యత రాహిత్యం వ్యవహరించే కరోనా రోగుల పట్ల కఠిన చట్టం అమల్లోకి తెచ్చింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఎవరైనా కరోనా రోగి ఇతరులపై ఉమ్మడం - తుమ్మడం చేస్తే హత్యాహత్నం కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఇలాంటి వారి వల్ల ఎవరైనా కరోనాతో చనిపోతే హత్యాయత్నం కేసును మర్డర్ కేసుగా మార్చి... ఆమరణాన్ని సాక్ష్యంగా చూపి విచారించాలని ఆ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్సార్ మర్ది ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ వేసిన ముందడుగు అందరికీ ఆదర్శనీయమే. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల ఎంతో కొంత ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇంతా చూస్తే.. అక్కడ బయటపడిన కేసులు 13 మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు చాలా తీవ్రంగా కృషిచేస్తోంది. ఇదిలా ఉండగా... సౌదీ అరేబియాలో కరోనా రోగులు గాని సాధారణ వ్యక్తులు గాని బహిరంగంగా ఎక్కడ ఉమ్మినా ఉరి శిక్ష వేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
   

Tags:    

Similar News