అన్న కలిశాడు.. తమ్ముడు పార్టీలోకి వెళుతున్నాడు

Update: 2021-01-01 04:30 GMT
గడిచిన కొన్నాళ్లుగా వెల్లువెత్తుతున్న అనుమానాలకు తగ్గట్లే.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు.  ఎప్పుడు పార్టీ మారతానన్న విషయంపై క్లారిటీ ఇవ్వని ఆయన.. బీజేపీలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేళ.. ఉదయాన్నే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే.. సంచలన నిర్ణయాన్ని వెల్లడించటం గమనార్హం.

టీపీసీసీ చీఫ్ పదవికి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తాను బీజేపీలోకి చేరుతున్నప్పటికీ.. తన సోదరుడు కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కమ్ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

తన నియోజకవర్గంలోని డెవలప్ మెంట్ కోసం నిధులు జారీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బాడీ లాంగ్వేజ్ లో తేడా ఉన్నట్లుగా కొందరు అనుమానించారు. వారి అనుమానం తాజాగా కొంతమేర నిజమైంది. కేంద్రమంత్రిని సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిస్తే.. కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలోకి ఎంపీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి మారటం గమనార్హం. మొత్తానికి కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News