అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు అయోధ్య చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉత్తరప్రదేశ్, అయోధ్య దేవాలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వివరించారు.
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయంలో శ్రీ రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి ఆలయ నిర్వాహకులు వివరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... మంచి పాలనకు రామరాజ్యమే ప్రామాణికమని అన్నారు. ఈ సందర్భంగా... శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం తన అభినందనలు తెలిపారు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని.. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
కాగా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం హైదరాబాద్ (బేగంపేట) విమానాశ్రయం నుంచి అయోధ్యకు బయలుదేరి రామాయలయాన్ని సందర్శించారు అని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల అరకూ ఆలయ ప్రాంగణంలో గడిపి.. తిరిగి విజయవాడకు బయలుదేరారు.త సంవత్సరం అత్యంత వైభవంగా జరిగిన బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన తర్వాత.. చంద్రబాబు ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి.