ఇక‌పై బంతి ఉమ్మి వేయ‌డం నిషేధం: క్రికెట్‌లో బీసీసీఐ జాగ్ర‌త్త‌లు

Update: 2020-05-19 23:30 GMT
ఆ మ‌హ‌మ్మారి రావ‌డంతో క్రీడా కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్ద‌య్యాయి. ముఖ్యంగా అంద‌ర్ని రంజింప చేసే ఐపీఎల్ మ్యాచ్‌లు కొన‌సాగ‌డం లేదు. ఇక ఒలంపిక్స్ వాయిదా ప‌డ్డాయి. ఇక వైర‌స్‌తో స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని గుర్తించి ఇప్పుడు లాక్‌డౌన్ క్ర‌మేణా ఎత్తివేస్తున్నారు. ప్ర‌జా జీవ‌నం సాధార‌ణ స్థితికి చేరుకోనుంది. కాక‌పోతే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో క్రీడా పోటీల‌కు అనుమ‌తించలేదు. కానీ భ‌విష్య‌త్‌లో జ‌రిగే పోటీల్లో మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే క్రికెట్‌లో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. బంతి మెరుపును మరింత పెంచేందుకు, రివర్స్‌ స్వింగ్ వ‌చ్చేందుకు బౌలర్లు ఉమ్మి (సెలైవా)ని ఉపయోగిస్తుంటారు. ఇక‌పై బంతిపై ఉమ్మి వేయ‌రాద‌ని నిర్ణ‌యించింది. ఉమ్మి ద్వారా ఆ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో మ్యాచ్‌ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా చేయాల‌ని అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ)కి బీసీసీఐ సిఫారసు చేసింది. చెమటను మాత్రం ఉపయోగించుకోవచ్చని అనిల్ కుంబ్లే సార‌థ్యంలోని బీసీసీఐ తెలిపింది.

ఈ మేర‌కు సోమ‌వారం బీసీసీఐ ప్ర‌తినిధులు ఐసీసీ బోర్డు స‌భ్యుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు తటస్థ అంపైర్లను కాకుండా ఆతిథ్య దేశ అంపైర్లను తీసుకు రావాలని ప్రతిపాదించింది. అసాధారణ పరిస్థితుల్లో జీవిస్తుండ‌డంతో క్రికెట్‌ను రక్షించేందుకు కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేస్తున్న‌ట్లు, మా సిఫారసులను ఐసీసీ బోర్డు ముందు ఉంచుతామ‌ని అనిల్‌ కుంబ్లే తెలిపారు.

ఉమ్మి లేదా చెమటతో బంతిని షైన్ చేసేవారని, ఇప్పుడు ఉమ్మి వ‌ద్ద‌ని చెప్పారు. వీటితో పాటు మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు. టెస్ట్‌ల్లో ముగ్గురు ఐసీసీ అంపైర్లు, ఒక్క హోస్ట్ అంపైర్ ఉండాల‌ని, వన్డేలకు ఇద్దరు ఐసీసీ, ఇద్దరు హోస్ట్ కంట్రీ అంపైర్లు, టీ20ల్లో నలుగురు హోస్ట్ కంట్రీ అంపైర్లు ఉండాల‌ని ప్రతిపాదనలు చేశారు. తటస్థ అంపైర్లను కాకుండా... అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆతిథ్య దేశ అంపైర్లను అంపైరింగ్‌ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా ఐసీసీకి సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. తుది నిర్ణ‌యం ఐసీసీ బోర్డు తీసుకోనుంది.


Tags:    

Similar News