డ్రగ్స్ కేసులో తెలుగు వాళ్లు ఇరుక్కున్నారా?

Update: 2021-10-06 10:30 GMT
డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుంది. పోలీసులు అనుమానం వచ్చి ఎక్కడ తనిఖీలు చేసినా డ్రగ్స్ పట్టుబడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇటీవల ముంబై టు గోవా వెళ్తున్న షిప్ లో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడిలో కొందమంది యువకులు, యువతులు డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడుల తరువాత పోలీసులు తమకు డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు తెలుగువాళ్లు ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని విదేశాల జైళ్లో శిక్షలు అనుభవిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి విదేశాల్లో కఠోర శిక్షలు ఉంటాయి. నగదుతో పాటు జైలు శిక్ష, మరణశిక్ష ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు పర్యటన చేసినప్పుడు దొరికితే చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అయితే కొందరు విదేశాలకు సులువుగా పంపిస్తామని చెప్పి వారితో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. అమెరికా, ఇతర దేశలకు వీసాల కోసం ప్రయత్నించేటప్పుడు యువతను లక్ష్యంగా చేసుకొని టుట్టు చప్పుడు కాకుండా హషీష్, గంజాయి మొదలగు నిద్ర బిల్లలు అనేక మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి స్మగ్లింగ్ ముఠాలు భారత్ లో అనేకంగా ఉన్నాయి.

ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు వేర్వేరు డ్రగ్స్ రవాణా కేసులో పట్టుబడ్డారు. దీంతో వారు ఖతర్ జైళ్లో కొన్నేళ్లుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు దోహాకు వస్తూ తన సమీప బంధువుకు చెందిన ఓ బ్యాగ్ ను తీసుకొచ్చాడు. అయితే దోహా విమానాశ్రయంలో జరిగిన తనిఖీలో ఆ బ్యాగ్ లో మాదక ద్రవ్యాలు లభించాయి .దీంతో న్యాయస్థానం ఆ యువకుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష 41.5 లక్షల జరిమానా విధించింది. అయితే ఇది స్వయంగా తాను చేసిన నేరం కాదని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

అయితే దుబాయ్, ఇతర దేశాల్లో జైలుశిక్షలు అనుభవిస్తున్నవారికి కారణ ఏంటో తెలుసుకోవడానికి అధికారులు శ్రద్ధ వహించడం లేదు. డ్రగ్స్ పట్టుబడిన వారికే హడావుడి చేసి ఆ తరువాత చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అమాయకులు జైలులు ఉంటుండగా.. అక్రమంగా డ్రగ్స్ దందా నిర్వహించేవారు బయట తమ వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిమాజాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి దుబాయ్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ తో పట్టుబడ్డడాడు. అయితే అతనిపై నిఘా ఉంచారు. అయితే ఆ ఉద్యోగి ఓ యువకుడికి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. దుబాయ్ చట్టాల ప్రకారం అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. మరో కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఇలా డ్రగ్స్ తో దొరికి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలా తెలుగువారు విదేశాల జైళ్లో మగ్గుతుండగా అందుకు సంబంధించిన మూలాలను మాత్రం కనుగొనడం లేదు. డ్రగ్స్ పై ఇలాగే మెతక వైఖరి ప్రదర్శిస్తే రాను రాను దేశం మొత్తం డ్రగ్స్ దందా విపరీతంగా సాగా ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని కాకుండా సరఫరా ఎక్కడి నుంచి అవుతుందో తెలుసుకుంటే.. దీని నుంచి తప్పించుకునే వీలుందని అంటున్నారు.




Tags:    

Similar News