ఆ సర్వే లో మూడో స్థానంలో హైదరాబాద్..ఏ విషయంలో అంటే?
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దాదాపుగా అందరి జీవితాలు తారుమారైయ్యాయి. కరోనా దెబ్బకి చాలామందికి ఉపాధి కూడా లేకుండా పోయింది. కరోనా మహమ్మారి తో హైదరాబాద్ లో 60 శాతానికి పైగా ప్రజలు తమ ఆదాయాలను కోల్పోయినట్టు ఓ ప్రముఖ సంస్థ సర్వేలో వెల్లడించింది. కరోనా వైరస్ తో ఆదాయాలు ఎక్కువగా కోల్పోయి, లోన్ల రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోయిన నగరాల్లో ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు ముందు వరుసలో ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది హైదరాబాద్ ప్రజలే అని ఆ సర్వే లో తెలిపింది. టాప్ 6 మెట్రో నగరాల్లో చెన్నై అత్యంత తక్కువగా ప్రభావితమైందని వెల్లడించింది. 35 నగరాల నుంచి 24 ఏళ్ల నుంచి 57 ఏళ్ల మధ్య వయసున్న 8,500 మందికి పైగా కన్జూమర్ల పై ఆ సంస్థ ఈ సర్వే చేసింది. లక్ష రూపాయలు లేదా ఆపైన అప్పు ఉన్న వారిని ఈ సర్వేలో లెక్కల్లోకి తీసుకున్నారు.
ఈ సర్వే ప్రకారం, కరోనా లాక్ డౌన్ ఆంక్షలతో 86 శాతానికి పైగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తన ఆదాయాలను నష్టపోయారు. ఈ కరోనా మహమ్మారి, లాక్ డౌన్ తో నాలుగో వంతు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తమ ఇన్ కమ్ లు జీరోగా ఉన్నట్టు చెప్పారు. శాలరీడ్ కస్టమర్ల పైనా లాక్ డౌన్ ప్రభావం బాగా చూపిందని సర్వే తెలిపింది. 56 శాతం మంది వేతన జీవుల జీతాలు కరోనా మహమ్మారితో ప్రభావితమైనట్టు సర్వే వెల్లడించింది. 12 శాతం మందికి ఉద్యోగాలు పోయాయి. వారికి ఎలాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని తెలిపింది. కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఢిల్లీ, ఎన్‌సీఆర్ నగరాలు బాగా ప్రభావితమయ్యాయని, సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కన్జూమర్లు తమ ఆదాయాలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించిందని వెల్లడించారని సర్వే తెలిపింది. వీరిలో ఎన్ సీఆర్ కు చెందిన 16 శాతం కస్టమర్లు తమ ఆదాయాలు జీరోకి పడిపోయినట్టు చెప్పారు. పూర్తిగా ఆదాయాలు పోగొట్టుకున్న కస్టమర్లలో ఎక్కువ మంది ముంబై నుంచి ఉన్నారు. ఇక దేశంలో ఎక్కువమంది ప్రజలు ఆదాయం కోల్పోయిన నగరాలలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.