• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైదరాబాద్ కు ఎలాంటి గౌరవం...

హైదరాబాద్ కు ఎలాంటి గౌరవం దక్కిందంటే?

By - Tupaki Desk
Update: 2019-04-11 06:17 GMT
దేశంలో మెట్రో నగరాలున్నా.. నిత్యం ఏదో ఒక ఇష్యూలో హైదరాబాద్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు తగ్గట్లే మరో అంశంలో హైదరాబాద్ గొప్పతనం దేశానికి తెలిపే నివేదిక ఒకటి వెల్లడైంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని ఆకర్షించటంలో దేశంలోని మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ విషయంలో మొదటి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ కి చెందిన ఎన్ సీఆర్ నిలువగా.. రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. మూడో స్థానాన్ని మాత్రం హైదరాబాద్ సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని అతి పెద్ద ప్రొఫెషనల్ నెట్ వర్క్ అయిన లింక్డ్ ఇన్ తెలిపింది. ఈ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన భారత ఉద్యోగస్తుల నివేదికలో ఈ వివరాల్ని వెల్లడించింది. కొత్తగా ఏ ఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి?  ఎలాంటి నిపుణులకు డిమాండ్ ఉందన్న విషయంతో పాటు.. దేశంలోని ఏ ఏ నగరాల్లో ఉద్యోగాలు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్.. బిజినెస్ మేనేజ్ మెంట్ రంగాలకు 2018లో విశేష డిమాండ్ కనిపించినట్లు పేర్కొంది. నిపుణుల్ని ఆకర్షించే నగరాల విషయానికి వస్తే.. ఎన్ సీఆర్.. బెంగళూరు.. హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. అహ్మదాబాద్ నిలిచాయి. చివరి స్థానాల్లో చండీగఢ్.. వడోదర.. జయపుర నిలవటం గమనార్హం.

బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని భావించే యువత సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందన్న విషయాన్ని లింక్డిన్ వెల్లడించింది. యువత తొలి ఎంపిక అమెరికానేనని.. తర్వాతి స్థానంలో యూఏఈ.. కెనడా.. యూకే.. ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.


Tags:    
  • Hyderabad 
  • 3 Cities 
  • Attracting talent 
  • LinkedIn report 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS