ఈ జేమ్స్ ఎంత డేంజ‌రంటే..!

Update: 2015-10-20 14:20 GMT
మ‌నిషి అన్న వాడు ఎంత ప్ర‌మాద‌కారో.. మెద‌డు కానీ ఒక్క‌సారి చెడుదారి ప‌డితే.. ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యం తాజా ఉదంతం చెబుతుంది. ఈ దారుణం గురించి విన్న త‌ర్వాత ఒక్క‌సారి షాక్ తిన్నంత ప‌ని అవుతుంది. కేవ‌లం క‌సితో 150 మంది అమ్మాయిల జీవితాల్ని అంతం చేసిన ఇత‌గాడి క‌ర్క‌స‌త్వం చూస్తే వ‌ణికిపోవాల్సిందే.

జ‌ల్సాలు.. విలాసాల‌తో.. చెడు అల‌వాట్ల‌కు లోనై నేరాలు చేయ‌ట‌మే కాదు.. అంత‌కు మించిన‌ శాడిస్ట్ ఆలోచ‌నతో చేసిన దారుణాలు విని పోలీసులు సైతం అవాక్కు అయ్యే ప‌రిస్థితి. ఒక దొంగ‌త‌నం కేసులో హైద‌రాబాద్ లోని మ‌ల్కాజిగిరి ప్రాంతానికి చెందిన జేమ్స్ ను ఉప్ప‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌గాడికి పోలీస్ మార్క్ ట్రీట్‌ మెంట్ ఇవ్వ‌టంతో నోటి వెంట ఒక్కొక్క నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాల్ని విన్న పోలీసులు షాక్ తిన్నారు.

ప‌గ‌లుపూట ఆటో న‌డిపే జేమ్స్ రాత్రి అయితే దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. దొంగ సొమ్ముతో విలాసాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. మ‌హిళ‌ల్ని ట్రాప్ చేసి విచ్చ‌ల‌విడిగా సెక్స్ కార్య‌క‌లాపాలు సాగించేవాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎయిడ్స్ సోకింది. దీంతో మ‌రింత క‌సిగా.. 300 మంది అమ్మాయిల‌కు ఎయిడ్స్ వ్యాప్తి చేయాల‌న్న దుర్మార్గ‌పు ఆలోచ‌న చేశాడు. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ 150 మంది అమ్మాయిల‌కు ఎయిడ్స్ వ్యాప్తి చేశాడు. త‌న‌కు భ‌యంక‌ర‌మైన రోగం ఉంద‌ని తెలుసుకొని.. క‌సిగా మిగిలిన వారికి అంటించాల‌న్న శాడిస్ట్ ఆలోచ‌న చేసిన జేమ్స్ నేరాల్ని నిరూపించే ప్ర‌య‌త్నంలో ఆధారాల కోసం పోలీసులు వెతుకులాట మొద‌లు పెట్టారు. మ‌న చుట్టూ ఉండేవారిలో ఎంత దుర్మార్గులుంటారో ఈ ఉదంతం చూస్తే అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News