పేకాటలో పెళ్లాం తాకట్టు .. ఓడిపోయి స్నేహితులకి అప్పగిస్తే .. !
పేకాటకి బానిసైన భర్త పేకాటలో ఓడి తన భార్యను స్నేహితులకు అప్పగించిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా కూడా మహాభారతంలో ధర్మరాజు భార్య ద్రౌపతిని జూదంలో పెట్టిన ఘటన గుర్తుకు రావడం తథ్యం. పేకాట లో భార్యను తాకట్టు పెట్టి , అందులో ఓడి భార్యను వారికి అప్పగించాడు. అందుకు ససేమిరా అని ఆ మహిళ అనడం తో చిత్ర హింసలు పెట్టి ,యాసిడ్ పోశాడు. స్నేహితులతో గడపాలని ఆ భర్త పెట్టే హింసలు భరించీ భరించీ చివరకు వ్యతిరేకించేసరికి యాసిడ్ పోసి నానా హింసలకు గురిచేయటంతో ఇక ఓపిక పట్టలేక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. భగల్ పూర్ లోని హసంగంజ్ కు చెందిన ఓ వ్యక్తి పేకాటకి , మద్యానికి బానిసయ్యాడు. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పటికైనా బుద్ది మారలేదు. పేకాటను వీడలేదు. దీంతో మరోసారి జూదం ఆడాడు. మళ్లీ ఓడిపోయాడు. దీతో భార్య ను నెల రోజుల పాటు స్నేహితులతో గడపాలని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ భర్త రెచ్చిపోయి నానా హింసలు పెట్టాడు. అప్పటికి ఒప్పుకోకపోవడం తో ఆమెపై యాసిడ్ పోసి చిత్రహింసలకు గురి చేసి మొజాహిద్పూర్లోని ఓ ఇంట్లో బంధించాడు. అక్కడకు తన స్నేహితుల్ని పంపించగా, వారంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఓ వైపు యాసిడ్ గాయాలు, మరోవైపు కామాంధుల గాయాలు , ఆ రెండింటి తో ఆమె కృంగిపోయింది. ఆ తర్వాత అక్కడినుంచి అతి కష్టంమీద తప్పించుకొని అలాగే , లోధిపూర్ లోని తండ్రి దగ్గరకు వెళ్లి గత శనివారం దీపక్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సహాయంతో లోధిపూర్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు భర్తను అరెస్ట్ చేశారు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.