'ప్ర‌జ‌ల మాట వింటాం': కొత్త ప్రోగ్రాంకు 'కాక్రోచ్' రెడీ

ప్ర‌జ‌ల ఏం చెబుతున్నారో.. వారి ఆలోచ‌న ఏమిటో.. వారి స‌మ‌స్య‌లు ఏమిటో తెలుసుకుంటామ‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు.

Update: 2026-08-06 18:53 GMT

ప్ర‌జ‌ల ఏం చెబుతున్నారో.. వారి ఆలోచ‌న ఏమిటో.. వారి స‌మ‌స్య‌లు ఏమిటో తెలుసుకుంటామ‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. నీట్ ప్ర‌వేశ ప‌రీక్ష ప్ర‌శ్న ప‌త్రం లీకైన ఘ‌ట‌న‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన ఉద్య‌మానికి దేశం యావ‌త్తు త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపింద‌ని.. దీనికి తాము ధ‌న్య‌వాదాలు చెబుతున్నామ‌న్నారు. ఇక‌పై ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు తీసుకుని.. వారి అభిప్రాయాల మేర‌కు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలోనే `ప్ర‌జ‌ల మాట వింటాం`(క్యాబోల్తీ ప‌బ్లిక్‌) పేరుతో కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంతోపాటు.. వారి ఆకాంక్ష‌ల‌ను అర్ధం చేసుకోవ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ము ఖ్య ల‌క్ష్య‌మ‌ని వివ‌రించారు. అంతేకాదు.. వారి త‌ర‌ఫున నిల‌బడేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌న్న సం కేతాల‌ను పంపిస్తామ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ ఉద్య‌మాన్ని ముమ్మ‌రం చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఎదు ర్కొంటున్న స‌మ‌స్య‌లే త‌మ‌కు కార్యాచ‌ర‌ణ‌గా మారుతాయ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో ఎవ‌రి ఒత్తిడీ లేద‌ని పేర్కొన్నారు. తాము రాజకీయాల్లోకి రావాల‌ని అనుకోవ‌డం లేద‌ని మ‌రో సారి దీప్కే స్ప‌ష్టం చేశారు.

విద్యార్థుల జీవితాల కోసం.. మెరుగైన విధానాల రూప‌క‌ల్ప‌న‌కు మేధావుల‌తో కూడా తాము చ‌ర్చిస్తామ న్నారు. ప్ర‌స్తుతం దేశంలో విద్య అత్యంత ఖ‌రీదైపోయింద‌ని దీప్కే అభిప్రాయ‌ప‌డ్డారు. ఎల్‌కేజీ, యూకేజీ ల‌కే ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆక్షేపించారు. ముఖ్యంగా పేద‌ల‌కు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌గా పేర్కొన్న ఆయ‌న వ‌చ్చే నెల నుంచి దేశ‌వ్యాప్తంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌ర్య‌టించ‌నున్నార‌ని.. స‌భ‌లు, స‌మావేశాల ద్వారా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంటామ‌ని వివ‌రించారు.

విద్య హక్కు కాదు.. వ్యాపారం!

దేశంలో విద్యాహ‌క్కు ప్ర‌స్తుతం వ్యాపారంగా మారిపోయింద‌ని ఆక్షేపించారు. కుటుంబాల‌కు పిల్ల‌ల చ‌దువు భారంగా మారింద‌న్నారు. అప్పులు చేసి త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించుకునే ప‌రిస్థితి కుటుంబాల‌కు తొల‌గాల‌న్న‌ది త‌మ ఆకాంక్ష‌గా పేర్కొన్నారు. కాగా.. తమ ఉద్య‌మంలో కొంద‌రు దుండ‌గులు ప్ర‌వేశించి ఉంటార‌న్న విష‌యం త‌మ కు తెలియ‌ద‌ని పేర్కొన్నారు. ఇక‌పై ప‌క్కాగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఎవ‌రైనా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మంలో పాల్గొనాలని భావిస్తే.. వారు `క్యూఆర్ కోడ్‌`లను స్కాన్ చేయాలని సూచించారు. ఎలాంటి స‌భ్య‌త్వ రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Tags:    

Similar News