అమెరికా గడ్డపై అమెరికన్లకే ఆఫర్.. అగ్రరాజ్యం పరువు తీసిన చైనా అధ్యక్షుడు

"మేం ప్రపంచానికే పెద్దన్నలం.. విజ్ఞానానికి చిరునామాలం" అని అమెరికా ఎంత డబ్బాలు కొట్టుకున్నా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాత్రం అమెరికన్లను చూసి జాలిపడిపోయినట్లున్నారు.

Update: 2026-09-26 05:23 GMT

"మేం ప్రపంచానికే పెద్దన్నలం.. విజ్ఞానానికి చిరునామాలం" అని అమెరికా ఎంత డబ్బాలు కొట్టుకున్నా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాత్రం అమెరికన్లను చూసి జాలిపడిపోయినట్లున్నారు. అందుకే వైట్‌హౌస్‌లో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ముందే కూర్చొని.. "మీ కుర్రాళ్లకు సరిగ్గా చదువు అబ్బడం లేదు, మా దేశానికి పంపించండి.. మేమే బాగా చదివిస్తాం" అన్నట్లుగా అమెరికన్లను అవమానిస్తూ ఒక మైండ్ బ్లాకింగ్ ఆఫర్ పడేసారు.

వచ్చే ఐదేళ్లలో ఏకంగా 1 లక్ష మంది అమెరికన్ విద్యార్థులను చైనాకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించి అగ్రరాజ్యానికి గట్టి షాకే ఇచ్చారు. నిజానికి అమెరికాలోని హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ లాంటి గ్రేట్ యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రపంచమంతా కొట్టుస్తుంటే జిన్‌పింగ్ మాత్రం "మీ పిల్లల్ని మా ఊరికి పంపండి.. మా సాంకేతికత, విద్యా విధానం చూసి కళ్లు తెరుస్తారు" అంటూ అమెరికా విద్యా వ్యవస్థ స్థాయిని ఒక్కసారిగా ప్రశ్నించేలా ప్లాన్ చేశారు.

గతంలో ఇచ్చిన 50 వేల మంది టార్గెట్‌ను గడువు కన్నా ముందే పూర్తి చేశామంటూ డబ్బాయింపులు పూర్తి చేసిన చైనా.. ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా లక్షకు పెంచేసింది. రాజకీయంగా, వాణిజ్యపరంగా రోజూ ఒకరి మీదొకరు ఆంక్షలు విధించుకుంటూ "నిన్ను నాశనం చేస్తా.. నన్ను నువ్వు ఏం చేయలేవు" అని తిట్టుకునే ఈ ఇద్దరి మధ్యలో ఈ ‘విద్యార్థుల మార్పిడి’ విచిత్రమైన కామెడీగా మారింది. "మీ అమెరికన్ యువతే మా భవిష్యత్తు" అంటూ జిన్‌పింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి ట్రంప్‌కు ఏడ్వాలో.. నవ్వుకోవాలో అర్థం కాని పరిస్థితి.

అక్కడితో ఆగితే చైనా ఎందుకవుతుంది? చదువుతో పాటు ఉచితంగా కలర్‌ఫుల్ ఆకర్షణలు కూడా జోడించింది. విద్యార్థుల ఆఫర్‌తో పాటు అమెరికాకు రెండు ‘జెయింట్ పాండాలను’ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించి ‘పాండా డిప్లమసీ’కి తెరలేపారు. అంటే వాణిజ్య యుద్ధాలు, టెక్నాలజీ ఆంక్షలతో విసిగిపోయిన అమెరికన్లకు.. "చదువుకోవడానికి మా దేశానికి రండి.. కాలక్షేపం కోసం ఈ బొమ్మలాంటి పాండాలను చూస్తూ ఆడుకోండి" అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

మొత్తానికి ప్రపంచానికి తామే సుప్రీం అని ఫీలయ్యే అమెరికా గడ్డపై నిలబడి, అమెరికన్లకే చదువు రమ్మని ఆఫర్ ఇచ్చి.. పాండాలను బోనస్‌గా ఇస్తానన్న జిన్‌పింగ్ దెబ్బకి వాషింగ్టన్ వర్గాల్లో పరువు పోయినంత పనైంది.

Tags:    

Similar News