జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం ఎస‌రు...?

కొన్ని రోజుల కింద‌ట శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు తాజాగా తూర్పుగోదావ‌రి ప‌ర్య‌ట‌న‌లో జ‌నాలు భారీగానే క‌నిపించారు.

Update: 2026-08-06 18:54 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఆ పార్టీ నాయ‌కులు జ‌నాల‌ను భారీగా త‌ర‌లించ‌డం అనేది కామనే. నిజానికి ఏ పార్టీ అయినా.. అధినేత బ‌య‌ట‌కు వ‌స్తే.. జ‌న స‌మీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కొన్నాళ్లు సాగాయ‌న్న‌ది వాస్త‌వం. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. కార‌ణాలు ఏవైనా.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట ప్ర‌కారం.. జ‌గ‌న్ వ‌స్తుంటే జ‌నాలే త‌ర‌లి వ‌స్తున్నార‌ట‌. కొన్ని రోజుల కింద‌ట శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు తాజాగా తూర్పుగోదావ‌రి ప‌ర్య‌ట‌న‌లో జ‌నాలు భారీగానే క‌నిపించారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌ను చూసి వైసీపీ నాయ‌కులు మురిసిపోతున్నారు. జ‌గ‌న్ వ‌స్తే జ‌నాన్ని త‌ర‌లించా ల్సిన అవ‌స‌రం లేద‌ని.. జ‌నాలే వారంత‌ట వారు త‌ర‌లి వ‌స్తున్నార‌ని చెబుతున్నారు. కానీ, రేపు భ‌విష్య త్తులో ఇదే వారికి శాపంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌తిప‌రిణామాన్నీ ప్ర‌భుత్వం నిశితంగా ప‌రిశీల‌న చేస్తోంది. తాజాగా తూర్పులో ఓ మ‌హిళకు చెందిన దుకాణాన్ని ధ్వంసంచేయ‌డం, పొగాకు బేళ్ల‌పై ఎక్కి తొక్క‌డం వంటివాటిని రికార్డు చేశారు.

ఇదే కాదు.. శ్రీకాకుళంలో మ‌హిళా ఎస్సైపై వైసీపీ నాయ‌కులు చేసిన దౌర్జ‌న్యం.. ఆమె ఇబ్బంది ప‌డిన తీరు వంటివాటిని కూడా రికార్డు చేశారు. అలాగే గ‌త ఏడాది గుంటూరు జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ప్పుడు మ‌రో కార్య‌క‌ర్త జ‌గ‌న్ కారు కింద‌న‌లిగి మృతి చెందాడు ఈ వ్య‌వ‌హారంపై కేసు కూడా న‌మోదైంది. దీనిని కూడా అధికార పార్టీ దాచిపెట్టింది. ఇలా.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌రుగుతున్న ప్ర‌తి త‌ప్పునూ టీడీపీ నాయ‌కులు రికార్డు చేస్తున్నారు.

ఎందుకంటే..

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌స్తుత సీఎం విజ‌య్ నిర్వ‌హించిన ర్యాలీలో తొక్కిస‌లాట జ‌రిగింది. దీంతో 40 మంది మృతి చెందారు. అలాగే.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ భార‌త్ జోడో పేరుతో పాద‌యాత్ర చేశారు. ఆ స‌మ‌యంలోనూ తొక్కిస‌లాట జ‌రిగింది. అయితే.. ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. బీహార్‌లో ప్ర‌శాంత్ కిశోర్ పాద‌యాత్ర చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప‌రిణామాల‌పై కోర్టులు తీర్పు ఇచ్చాయి.

పాద‌యాత్ర‌ల స‌మ‌యంలో 500ల‌కు మించి జ‌నాలు లేకుండా చూసుకునే బాధ్య‌త‌ను చెప్పాయి. ఇప్పుడు రేపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌డితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన త‌ప్పుల‌ను చూపించి ఆయ‌న పాద‌యాత్ర‌కు బ్రేకులు వేసే దిశ‌గా ప్ర‌భుత్వ ప‌క్షం ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఏమైనా జ‌నాలు వ‌స్తున్నార‌ని అనుకుంటే.. రేపు అస‌లు కార్య‌క్ర‌మానికి ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News