• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ఇంటింటికీ' ఎఫెక్ట్‌: ...

'ఇంటింటికీ' ఎఫెక్ట్‌: నేత‌లను కొలుస్తున్నారు..!

| 'ఇంటింటికీ కూట‌మి' పేరుతో టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ప‌లు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో నాయ‌కులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

By - Garuda Media
Update: 2026-08-06 19:04 GMT

'ఇంటింటికీ కూట‌మి'  పేరుతో టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ప‌లు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో నాయ‌కులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సంక్షేమాన్ని వివ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఒక ఇంట్లో ఎంత మేలు జ‌రిగింది? ఎవ‌రెవ‌రికి ఏయే ప‌థ‌కాలు అందుతున్నాయ‌న్న విష‌యాన్ని స‌మ‌గ్రంగా వివ‌రిస్తున్నారు. మొత్తంగా ఈ కార్య‌క్ర‌మంలో నిర్విఘ్నంగానే సాగుతోంది.

ఈ కార్య‌క్ర‌మం మొత్తాన్నీ మూడు అంచెలుగా పార్టీ విభ‌జించింది. దీని ప్ర‌కారం.. నాయ‌కుల‌ను అంచ‌నా వేస్తున్నారు.

1) కూట‌మి నాయ‌కుల‌ను క‌లుపుకొని పోవ‌డం: ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లే స‌మ‌యంలో నాయ‌కులు సరైన సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. కూట‌మి ఐక్యంగానే ఉందని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేయాలి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌ను కూడా క‌లుపుకొని పోవాల్సిన అవ‌స రం ఏర్ప‌డింది. అయితే.. ఈ విష‌యంలో మాత్రం నేత‌లు దాదాపు వెనుక‌బ‌డుతున్నారు.

2) వైసీపీ లోపాల‌ను ఎత్తి చూప‌డం: ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తన్న నాయ‌కులు ఈ విష‌యంలోనూ వెనుక‌బ‌డుతున్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తి చూపుతూ.. తాము ఇప్పుడు ఏం చేస్తున్నామన్నది ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తే.. తేడా తెలుస్తుంద‌ని పార్టీ అధినేత భావిస్తున్నారు. కానీ, రాజ‌కీయంగా ఎందుకో ఈ విష‌యంలో నాయ‌కులు చేయ‌డం లేదు. కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే దీనిని ప్రాధాన్య అంశంగా చూస్తుండ‌గా.. మిగిలిన జిల్లాల్లో ఈ విష‌యాన్ని వ‌దిలేస్తున్నారు.

3) స్థానిక కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డం: స్థానికంగా ఉన్న టీడీపీ కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశం కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఇమిడి ఉంది. ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తు న్నారు. కేడ‌ర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇంటింటికీ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున కేడ‌ర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటి ఆధారంగానే నాయ‌కులపై పార్టీ ఒక అంచ‌నాకు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత‌.. ప‌ద‌వులు ఇవ్వాల‌న్నా.. దీనినే కొల‌మానంగా తీసుకుంటార‌ని.. తాజాగా మ‌రోసారి పార్టీ అధినేత చంద్ర‌బాబు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్మం.

Tags:    
  • tdp 
  • intintikikutami 
  • andhrapradesh 
  • chandrababunaidu 
  • janasena 
  • bjp 
  • politics 
  • appolitics 
  • welfare 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS