యాంకర్ హిందువు కాడని దారుణం

Update: 2019-08-02 11:03 GMT
హిందుత్వ భావజాలం జనాలను కప్పేస్తోంది. హిందువుల ముసుగులో హిందువేతరులను అవమానాల పాలు చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. తాజాగా జోమాటోలో ఆర్డర్ చేస్తే ఓ ముస్లిం డెలివరీ బాయ్ ఫుడ్డు తీసుకువచ్చాడని రిజెక్ట్ చేసిన వైనం కలకలం రేపింది.ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటుచేసుకుంది. ఓ టీవీ చానెల్ లో చర్చా కార్యక్రమం వివాదాస్పదమైంది. ‘హమ్ హిందూ’ సంస్థ అధ్యక్షుడు అజయ్ గౌతమ్.. తాజాగా ఈ కార్యక్రమం సందర్భంగా ఈయన యాంకర్ హిందువు కాకపోవడంతో ఆయనను చూడకుండా చేతులు అడ్డుపెట్టుకొని మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. సదురు యాంకర్ హిందువు కాకపోవడంతోనే ఇలా అతడి ముఖం చూడలేనంటూ అజయ్ గౌతమ్ వ్యవహరించడం వివాదాస్పదమైంది.

జోమాటో ఫుడ్ డెలివరీ వివాదంపై తాజాగా ‘న్యూస్ 24’ చానెల్ లో జరిగిన చర్చకు ‘హమ్ హిందు’ సంస్థ అధ్యక్షుడు అజయ్ గౌతమ్ ను ఆహ్వానించారు. అయితే యాంకర్ హిందూ కాకపోవడంతో అతడిని చూడనంటూ అజయ్ గౌతమ్ చేతులు అడ్డుపెట్టుకొని వివక్ష చూపాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చర్చలో రెండు వర్గాలుగా విడిపోయి వాదులాడుకున్నారు. నెటిజన్లు కూడా ఒక వర్గం వారు అజయ్ గౌతమ్ కు.. ఇంకో వర్గం వారు యాంకర్ కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.

    

Tags:    

Similar News