విశాఖలో టీడీపీ కి బిగ్ షాక్ .. వైసీపీ లోకి గంటా అనుచరుడు .. త్వరలో గంటా కూడా ?

Update: 2021-03-03 09:09 GMT
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న ఈ సమయంలో వలసల రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా విశాఖలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. అయన వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అయన ఇప్పటివరకు  గంటాకు కాశీ విశ్వనాధం కుడిబుజంలా ఉండేవారు. గంటాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునే వాడు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ అతడు పార్టీ మారడం టీడీపీకి పెద్ద షాకే అని చెప్పాలి.

కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడంతో  ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బతప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాశీ విశ్వనాథం చేరికతో ఇప్పుడు గంటా ఎప్పుడు వైసీపీలో చేరుతారనే చర్చ మొదలైంది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు వస్తాను అంటే మేము కాదంటామా అంటూ కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా పార్టీ అవకాశం ఉందని టీడీపీ కూడా అనుమానిస్తోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ముందు గంటా ప్రధాన అనుచురుడు పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.. అయితే కాశీవిశ్వనాథం పార్టీలో చేరినప్పుడు అక్కడ అవంతి లేకపోవడం చర్చనీయాంశగా మారింది. ఆయనను చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదంటున్నారు. మరి త్వరలో గంటా కూడా వైసీపీలో చేరితే అవంతి పరిస్థిఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఏదీ ఏమైనా ప్రస్తుతం విశాఖలో ఈ పరిణామాలతో రాజీకీయం వేడెక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ తదితరులు ఇప్పటికే వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News