• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా ఎఫెక్ట్ : IPL...

కరోనా ఎఫెక్ట్ : IPL అభిమానులకి నిరాశ తప్పదా ?

By - Tupaki Desk
Update: 2020-03-04 22:30 GMT
IPL ..ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ ప్రపంచంలో ఈ ఐపీయల్ లీగ్ కి ఉన్నంత క్రేజ్ .. బజ్ , మరే ఇతర లీగ్స్ కి లేదు. అది ఒక్క ఐపీఎల్ కే సాధ్యం. ప్రపంచ దేశాల స్టార్ ప్లేయర్స్ , ఉర్రుతలూగించే అద్భుతమైన విన్యాసాలు , అద్భుతమైన బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ ఇలా ఒక్కటేమిటి , అన్ని కలిసి ఐపీఎల్ ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేశాయి. ఇకపోతే మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొన్ని జట్లు ..ఐపీఎల్ కోసం కసరత్తులు కూడా ప్రారంభించేసాయి. అభిమానులు కూడా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే , ఇదే సమయంలో అందరి మదిలో మరో ప్రశ్న కూడా మెదులుతుంది. మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో ..భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కరోనా ప్రభావం క్రీడారంగం పై పడబోతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 2020 ఐపీఎల్ షెడ్డ్యూల్ ప్రకారం జరుగుతుందా , లేదా అని సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ విషయం పై ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ స్పందించారు. ఓ మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన 2020 పై కరోనా ప్రభావం లేదని ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ మార్చి 29న ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఇక , ఈ విషయం పై బీసీసీఐ ఛైర్మన్‌ , మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా స్పందించారు. ఈ ఏడాది నిర్వహించబోయే ఐపీఎల్ లో ఎలాంటి మార్పులు ఉండవని, ఐపీఎల్ అన్ని మ్యాచ్ లు షెడ్డ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపారు. అలాగే , ఈ నెల 12న జరగబోయే వన్డే సిరీస్ కు దక్షిణాఫ్రికా భారత పర్యటనకు రాబోతుంది. ఈ వన్డే సిరీస్ లో కూడా ఎటువంటి మార్పులు లేవని దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనకి వస్తుంది అని , అయితే ఈ కరోనా విషయం లో బీసీసీఐ కొన్ని జాగ్రత్తలు పాటిస్తుందని గంగూలీ తెలియజేసాడు. అయితే , కరోనా ఇప్పుడిప్పుడే ఇండియా లో విజృంభిస్తున్న నేపథ్యం లో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి ...
Tags:    
  • Huge Shock For Ipl Fans Because Of Corona Effect 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Ipl 2020 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS