గాంధీ కళ్లద్దాల ధర ఎంత భారీగా పలికాయో తెలిస్తే షాకే

Update: 2020-08-22 08:50 GMT
జాతిపిత మహాత్మాగాంధీ కళ్లద్దాల్ని తాజాగా ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. దీనికి పలికిన ధర విన్నోళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీ మొత్తం బాపూజీ ధరించిన కళ్లద్దాలకు వస్తుందన్న అంచనానే లేదని చెబుతున్నారు. గాంధీ మహాత్ముడు వాడిన వస్తువుల్ని అప్పుడప్పుడు వేలానికి రావటం తెలిసిందే. భారత జాతిపిత వస్తువుల్ని ఎవరెవరో కొంటారుకానీ.. భారత ప్రభుత్వం మాత్రం వాటిని కొనుగోలు చేసే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే. .తాజాగా గాంధీ వాడిన గుండ్రంగా ఉండే కళ్లద్దాల్ని తాజాగా వేలం వేశారు. అమెరికాలో ఇలాంటి అరుదైన వస్తువులు కొనే వ్యక్తం భారీ ధర చెల్లించి వాటిని సొంతం చేసుకున్నాడు. 2.6లక్షల పౌండ్ల మొత్తానికి కళ్లద్దాల్ని కొనుగోలు చేశారు. దీన్ని మన రూపాయిల్లోకి మారిస్తే ఎంతో తెలుసా? అక్షరాల 2.55కోట్లు (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే రూ.2,55,00,906)గా చెబుతున్నారు.

గాంధీ కళ్లదాల్ని ఆన్ లైన్ వేలం వేసిన ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ సౌతంఆశ్చర్యానికి గురైంది. ఆన్ లైన్్ లో ఆరు నిమిషాల వ్యవధిలోనే సేల్ అయిపోయిందని చెబుతున్నారు. వేలానికి ముందు.. ఈ కళ్లద్దాలకు రూ.14.71లక్షల మొత్తం పలికే అవకావశం ఉందని భావించారు. అందుకు భిన్నంగా వందల రెట్ల అధిక ధరకు అమ్ముడు కావటం విశేషం. ఇంతకీ ఈ కళ్లద్దాలు అమ్మిన వ్యక్తికి ఎలా వచ్చాయన్న దానికి ఆసక్తికర అంశాల్ని చెబుతున్నారు.

మాంగోస్ట్స్ ఫీల్డ్ లో ఉన్న ఒక పెద్దాయన వద్ద బాపూజీ కళ్లద్దాలు ఉండేవి.  ప్రస్తుతం ఆయన పెద్ద వయస్కుడు అయ్యాడు. దీంతో.. తన దగ్గర ఉన్నకళ్లద్దాల్ని అమ్మేసి.. వచ్చిన డబ్బుల్లో సగం మొత్తాన్ని తన కుమార్తెకు పంచుతానని చెప్పాడట. ఇంతకీ ఈ పెద్దాయనకు బాపూజీ కళ్లజోడు ఎలా వచ్చిందంటే.. 1920లో ఆఫ్రికాలో గాంధీని ఈ పెద్దాయన కుటుంబ సభ్యులు కలిశారట. ఆ సందర్భంగా బాపూ వాడిన కళ్లజోడు తమకు వచ్చిందని చెబుతున్నారు.

అలా తీసుకొచ్చిన కళ్లద్దాల్నియాభై ఏళ్లుగా అలానే పక్కన పెట్టేశారు. తాజాగా చూసిన వారు.. వాటిని అమ్మకానికి పెట్టారు. తాము అనుకున్న మొత్తానికి.. ఏ మాత్రం సంబంధం లేకుండా భారీ ధరకు అమ్ముడు కావటంతో వాటి యజమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకాలం తమ వద్ద ఉన్న కళ్లజోడు విలువ రూ.2.5కోట్లకు పైనే ఉండటాన్ని వారిప్పటికి నమ్మలేకపోతున్నారట.
Tags:    

Similar News