200 కోట్లు కొట్టేశాడు.. బిజినెస్ మెన్ ల భార్యలే అతడి టార్గెట్
రాజకీయ నాయకులు, సీనీనటులు, వ్యాపారవేత్తలే టార్గెట్.. డబ్బున్న వారు కష్టాల్లో పడితే అతనికి పంట పండుతుంది. వారి కష్టాన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ప్రణాళికే వేస్తాడు. కష్టాల్లో ఉన్న వారిని గట్టెక్కిస్తానంటూ మాయ మాటలు చెబుతాడు.. తనకు పెద్ద పెద్ద మనుషులతో సంబంధాలున్నాయని చెప్పి నమ్మిస్తాడు. ఆ మాటలకు నమ్మిన వారు అతని చేతిలో డబ్బు పెట్టగానే ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతాడు. అయితే ఇతని ఆగడాలు ఎక్కువకాలం సాగలేదు. తొందర్లోనే పోలీసుల వద్దకు వెళ్లింది. దీంతో వివరాలను రాబట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇంతకీ అతను ఎవరు..? బడా వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేశాడు..?
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్ ను ఇటీవల చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించిన తరువాత పోలీసుల షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పైకి చూడ్డానికి మాములుగానే ఉన్నా తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని, తనకు పెద్ద పెద్ద నాయకులతో మంచి సంబంధాలున్నాయని కలరింగ్ ఇస్తారు.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కన్నారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఈడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను విచారించారు. హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న ఈ నటి చంద్రశేఖర్ చేతిలో మోసపోవడం గమనార్హం. పోలీసుల విచారణలో జాక్వెలిన్ పలు ఆసక్తి విషయాలను చెప్పింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూపింగ్ ద్వారా జాక్వెలిన్ ను చంద్రశేఖర్ కలిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని ఫెర్నాండేజ్ ను పరిచయం చేసుకున్నాడు. అయితే జాక్వలిన్ కూడా చంద్రశేఖర్ ను నమ్మింది. ఈ క్రమంలో ఆమెకు చంద్రశేఖర్ ఖరీదైన చాక్లెట్లు, పూలు పంపేవాడు. వీటిని బహుమతి అని చెప్పేవాడు. సుకేశ్ , జాక్వెలిన్ ల మధ్య 20కి పైగా కాల్ రికార్డులు ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాటి ద్వారా జాక్వెలిన్ ను ఎలా మోసం చేశాడో రాబట్లనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం విచారిస్తోంది. చంద్రశేఖర్ తో పాటు లీనా పాల్ లపై 23 చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వారిని విచారించి అనేక విషయాలు రాబట్టామని, భద్రతా కారణాల వల్ల వాటిని వెల్లడించడం లేదంటున్నారు.
సుకేశ్ చంద్రశేఖర్ 17 సంవత్సరాల వయసులోనే నేర ప్రవృత్తికి అలవాటుపడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అక్రమార్గాలను ఎంచుకున్నాడు. బెంగుళూరులోని డెవలప్మెంట్ అథారిటీ చీటింగ్ కేసులో చంద్రశేఖర్ ను మొదటిసారిగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ నాయకుడి బంధువునని అతను ఓ పని పూర్తి చేస్తానని 100 మందిని పైగా మోసం చేసి రూ. 75 కోట్లు రాబట్టుకున్నాడు. తక్కువ ధరకే కార్లను కొనుగోలు చేస్తానని ఇతరులను నమ్మిస్తాడు. ఇతరులు అతడిని పలుకుబడిన వ్యక్తిగా అనుకునేందకు బీకాన్ కారులో తిరుగుతూ.. అప్పట్లో ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడిని అని కూడా ప్రచారం చేసుకున్నాడు.