అచ్చెన్న నాటౌట్ ...రీజన్ ఇదే !

అందుకే గతసారి అయిదేళ్ళ పాటు కీలక శాఖలకు మంత్రిగా చేసిన అచ్చెన్న టీడీపీ విపక్షంలోకి వచ్చినపుడు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు తిరిగి ఇపుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.;

Update: 2026-03-27 03:30 GMT

ఉత్తరాంధ్రాలో దిగ్గజ నేతగా ఉన్న దివంగత ఎర్రన్నాయుడు వారసత్వాన్ని భర్తీ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు, కానీ తమ్ముడిగా అచ్చెన్నాయుడు తనదైన శైలిలో దూకుడు రాజకీయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నకు తగిన తమ్ముడుగా పేరు గడించారు. చంద్రబాబు నాయుడు నిండు అభిమానానికి పాత్రుడు అయ్యారు. అందుకే గతసారి అయిదేళ్ళ పాటు కీలక శాఖలకు మంత్రిగా చేసిన అచ్చెన్న టీడీపీ విపక్షంలోకి వచ్చినపుడు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు తిరిగి ఇపుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

మూడు దశాబ్దాల రాజకీయం :

ఇక అచ్చెన్నాయుడు 1996లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అన్న ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి లోక్ సభకు పోటీ చేయడంతో ఆయన వరసగా నాలుగు సార్లు గెలిచి ఓటమెరుగని నేతగా పేరు తెచ్చుకున్న హరిశ్చంద్రపురం నుంచి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో అచ్చెన్న ఎంట్రీ ఇచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలా 1999, 2004 లలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2009 లో జరిగిన అసెంబ్లీ పునర్ విభజనలో హరిశ్చంద్రపురం పోయింది. దాంతో తమ సొంత మండలం విలీనం అయిన టెక్కలికి ఆయన షిఫ్ట్ అయ్యారు. టెక్కలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలో ఓటమి పాలు అయినా 2014, 2019, 2024లలో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఒక విధంగా టెక్కలిని కంచుకోటగా మార్చుకున్నారు అని చెప్పాలి.

మరింత అంకితభావంతో :

ఇక తాజాగా అచ్చెన్నాయుడు పుట్టిన రోజు జరిగింది. సీఎం చంద్రబాబు చాంబర్ లో అచ్చెన్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ తో సహా ఇతర మంత్రులు అంతా అభినందనలు తెలిపారు. ఇక బాబు అయితే అచ్చెన్న చేత కేక్ కట్ చేయించి దీవించారు. ప్రజాభివృద్ధి లక్ష్యంగా అచ్చెన్నాయుడు సుదీర్ఘ సేవ చేస్తున్నారు అని కొనియాడారు. దాంతో ఎంతో ఆనందించిన అచ్చెన్నాయుడు ఇదే స్పూర్తితో మరింత అంకిత భావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. చంద్ర‌బాబు ఆశీస్సులు నాకు మరింత బాధ్యతను పెంచాయని మంత్రి అచ్చెన్న‌ చెప్పారు. అందరి ఆత్మీయత, ఆశీస్సులు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రైతన్నల సంక్షేమం కోసం ఉత్సాహంగా మరింత అంకితభావంతో పనిచేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు గట్టిగా చెబుతున్నారు.

పోటీ ఖాయం :

ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల నాటికి తప్పుకుని తన వారసుడికి చాన్స్ ఇస్తారని ఇంతకాలం ప్రచారం సాగింది. అయితే సీట్లు అదనంగా పెరగడంతో సీనియర్ల ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు. అలాగే పార్టీ సైతం సమతూకం పాటిస్తుందని చెబుతున్నారు. సీనియర్లు జూనియర్లకు పెద్ద పీట వేసి సమాన అవకాశాలు ఇస్తుందని అంటున్నారు. దాంతో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో అచ్చెన్న రంగంలో ఉంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని అంతా అంటున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం ఎపుడూ కింజరాపు కుటుంబం మీద ప్రత్యేక అభిమానం చూపిస్తుంది అన్నది అందరికీ తెలిసిందే. దాంతో అచ్చెన్న నాటౌట్ అని ఆయన అభిమానులు అనుచరులు పుట్టిన రోజు వేళ పెద్ద ఎత్తున శుభాకాక్షలు తెలియచేస్తున్నారు.

Tags:    

Similar News