• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జేఎన్‌ యూ పై మేమే దాడి...

జేఎన్‌ యూ పై మేమే దాడి చేసాం : హిందూ రక్షాదళ్

By - Tupaki Desk
Update: 2020-01-07 09:44 GMT
జేఎన్‌ యూ విద్యార్థులు, అధ్యాపకుల పై జనవరి 5న ముసుగులు ధరించిన దుండగులు విచక్షణా రహితంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్‌తో పాటు మరో 35మంది వరకు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ దాడికి మీరు కారణమంటే.. మీరు కారణమంటూ.. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. కాగా జేఎన్‌ యూ విద్యార్థులపై దాడికి హిందూ రక్షాదళ్ బాధ్యతను ప్రకటించుకుంది.

ఈ మేరకు భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ భయ్యా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జేఎన్‌యూ క్యాంపస్‌లో సంఘ విద్రోహ,హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే క్యాంపస్‌లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొరబడి దాడి చేసినట్టు చెప్పారు. జేఎన్‌యూ క్యాంపస్ కమ్యూనిస్టులకు అడ్డాగా మారి పోయిందని, దాన్ని తాము సహించబోమని , వాళ్లు తమ మతాన్ని, దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. తమ మతం పట్ల వారి వైఖరి దేశ ద్రోహుల్లా ఉందని ఆరోపించారు. భవిష్యత్‌ లో ఇతర యూనివర్సిటీల్లోనూ ఎవరైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, మరోసారి జేఎన్‌యూ లాంటి ఘటనలు రిపీట్ అవుతాయని కూడా హెచ్చరించారు.

మన దేశంలో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ,ఇక్కడే చదువుకుంటూ,దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని మేం సహించబోం. ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే... వారికి ఇదే తరహా సమాధానం చెబుతాం. భారత మాతకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని అందుకే జేఎన్‌ యూపై దాడి చేశాం. ఆ దాడిలో పాల్గొన్నదంతా మా హిందూ రక్షా దళ్ సభ్యులే. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం.అని భూపేంద్ర తోమర్ అన్నారు.


Tags:    
  • Hindu Raksha Dal claims responsibility for JNU violence 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu Political Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

Copyright @2026

Powered by Blink CMS