బిగ్ బాస్ షో ఆగిపోనుందా..? 11న ఎలాంటి తీర్పు రానుంది..?

Update: 2022-10-02 04:03 GMT
బుల్లితెరపై కాకపుట్టిస్తున్న బిగ్ బాస్ షోకు విపరీతంగా ప్రేక్షకులు పెరిగారు. గతంలో టీవీలను పట్టించుకోని వారు ఇప్పుడు ఈ షో ప్రారంభం కాగానే బుల్లితెర ముందు వాలిపోతున్నారు. రియాల్టీ షో చూపిస్తామని తెలిపిన నిర్వాహకులు అనుకున్న విధంగానే  కంటెస్టెంట్ల మధ్య జరిగిన రియల్ సీన్స్ ను ప్రసారం చేస్తున్నారు. అయితే గతంలో కాస్త అటూ ఇటూ బూతు పురాణం ఉన్నఈ షో లో ఇప్పుడు హద్దులు దాటుతోంది. అంతేకాకుండా లేడీ కంటెస్టెంట్ల పొట్టి డ్రెస్సులు, వారి మధ్య హగ్గులతో అశ్లీల ఫిల్మ్ ను తలపిస్తున్నాయని కొందరు ఇప్పటికే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని పిటిషన్ వేయగా హైకోర్టు సైతం ఈ ఇష్యూను టేకాఫ్ చేసింది. బిగ్ బాస్ షో ప్రసారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 11న దీనికి సంబంధించిన హియరింగ్ సాగనుంది. అందులో ఏం జరగబోతుందోన్న ఉత్కంట నెలకొంది.

హిందీలో మొదలైన బిగ్ బాస్ షో తెలుగులోనూ 2017 జూలై 16 నుంచి మన టీవీల్లో ప్రసారమవుతోంది. మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ కు ఊపు తెచ్చారు. ఆ తరువాత మరో స్టార్ హీరో నాని  కూడా ఈ షో ను సమర్థవంతంగానే నడించారు. అయితే నాని హోస్ట్ గా ఉన్న సమయంలో కొందరికే మద్దతు పలుకుతున్నాడన్న విమర్శలు వచ్చాయి. ఆయినా ఓవరాల్ గా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక మూడో షో నుంచి అక్కినేని నాగార్జున షోకు హోస్ట్ గా ఉంటూ వస్తున్నారు.

ఇప్పటికే వరకు 5 షో లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కరోనా కారణంగా మధ్యలో షో ప్రసారం చేయకపోయినా ఓటీటీ వేదికగా రన్ చేశారు. కానీ టీవీల్లో ప్రస్తుతం ప్రసారమవుతోంది మాత్రం 6 వ షోనే.  బిగ్ బాస్ షో  గురించి మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. కానీ రాను రాను కంటెస్టెంట్ల బిహెవియర్ హద్దులు దాటుతుండంతో విమర్శలు మొదలయ్యాయి. సీపీఐ నాయకుడు నారాయణ గత సీజన్  సందర్భంగా కంటెస్టెంట్లను జంతువుల్లా చూస్తూ వారిని జూలో పెట్టి ఆడిస్తున్నారని విమర్శించారు. కానీ విమర్శల కంటే షో చూసేవారి సంఖ్యే ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు.

ఆరో సీజన్ మొదట్లోనూ నారాయణ మరోసారి బిగ్ బాస్ షో పై విమర్శలు చేశారు. అయినా షో ప్రసారమవుతోంది. కానీ ఈసారి షో లో మాత్రం హద్దులు దాటినట్లే తెలుస్తోంది. కంటెస్టెంట్ల మధ్య హగ్గులు, ముద్దు సీన్లు మరీ ఎక్కువయ్యాయని కొందరు విమర్శిస్తున్నారు.  లేడి కంట  దీంతో ఈ షో ను ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేకపోతున్నారని అంటున్నారు. అందువల్ల ఈ షో ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఏపీకి చెందిన న్యాయవాది జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ షో లో అశ్లీలత ఎక్కువైందని, ఈ కారణంగా ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులు టీవీల చూడలేకపోతున్నారని, అందువల్ల దీనిని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రసారం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. బిగ్ బాస్ షో నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో గుర్తున్నాయా..? అంటూ ప్రశ్నించింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో ఈనెల 11న విచారించనున్నట్లు తెలిపింది. దీంతో హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందోనని బిగ్ బాస్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఈ షో ఆగిపోనుందా..? అన్న చర్చ సాగుతోంది.
Tags:    

Similar News