• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లారీ డ్రైవర్ ను దారడిగిన...

లారీ డ్రైవర్ ను దారడిగిన హెలికాప్టర్ పైలట్

By - Tupaki Desk
Update: 2017-02-17 07:23 GMT
ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టరుకు దారి తెలియలేదట... ఎటుచూసినా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఆ పైలట్ కు ఎటు వెళ్లాలో తెలియలేదట. అలాంటప్పుడు ఏం చేయాలి.. ఎవరినడగాలి? మనమైతే ఏం చేస్తామో ఏమో కానీ ఆ హెలికాప్టర్ పైలట్ మాత్రం ఏమాత్రం మొహమాటపడకుండా కింద కనిపించిన రోడ్డు మీద హెలికాప్టరును దించి.. ఓ లారీని ఆపి డ్రైవరును రూటు అడిగాడు. ఈ ఫన్నీ రియల్ ఇన్సిడెంట్  కజకిస్థాన్ లో జరిగింది.
    
కజికిస్థాన్‌ లోని ఓ జాతీయ రహదారిపై లారీలు రయ్య్ రయ్య్ మంటూ దూసుకుపోతున్నాయ్. అలాంటి సమయంలో పైనుంచి హెలికాప్టర్ ఒకటి రోడ్డుకు అతి సమీపంలో పైన ఎగురుతూ ఇంకాఇంకా కిందకు వస్తోంది. దాంతో ఆ హెలికాప్టర్ ల్యాండింగుకు ట్రయ్ చేస్తుందని అర్థం చేస్తున్న లారీ డ్రైవర్లు తమ లారీలను ఆపేశారు. ఆ మాత్రం గ్యాప్ దొరగ్గానే హెలికాప్టర్ ను రోడ్డు మీద దించేశాడు పైలట్.  చూస్తే... అది కజికిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్‌.
    
ఏం జరిగిందా? అని లారీ డ్రైవర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్న దశలో ఆ హెలికాప్టర్‌ నుంచి కిందికి దిగిన పైలట్‌.. నేరుగా ఓ లారీ డ్రైవర్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి, అక్తుబిన్సిక్‌ నగరానికి ఎలా వెళ్లాలని దారి అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ లారీ డ్రైవర్‌, అంతలోనే తేరుకుని ఎలా వెళ్లాలో సూచించాడు. అతని సూచనల మేరకు హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి పయనమైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
    
ఇంతకీ ఇందులో ఫైనల్ ట్విస్టేంటో తెలిస్తే షాకవుతారు. కజికిస్ధాన్ రక్షణ శాఖ శిక్షణలో భాగంగా శిక్షణ పైలట్లకు గమ్యానికి దారి చెప్పకుండా పంపిస్తారు. వారే వారే గమ్యాన్ని కనుక్కుని చేరాల్సి ఉంటుంది.  జనరల్ గా రూట్ మ్యాప్ లు, జియోగ్రఫికల్ అండర్ స్టాండింగ్ తో పైలట్లు తెలుసుకుంటారు. కానీ, మనోడు మాత్రం ఏకంగా లారీ డ్రైవర్లను అడిగి టెస్టు పాసైపోయాడు. పైలట్ కాకముందు లారీ డ్రైవరుగా పనిచేశాడో ఏమో మరి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Helicopter pilot 
  • Directions 
  • Kazakhstan 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS