జగన్ ఫారిన్ లుక్ అదిరిందిగా?

Update: 2019-08-02 10:34 GMT
నాలుగురోజుల విదేశీ పర్యటన కోసం వెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన.. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లటం తెలిసిందే. ఇప్పటికే ఇజ్రాయిల్ చేరుకున్న ఆయన.. అభిమానుల్ని.. మిత్రులను కలుస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో ఆసక్తికరంగా మారి.. అందరి చూపు పడేలా చేస్తోంది. జగన్ అన్నంతనే లైట్ కలర్ ఫ్యాంట్ మీద.. ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండని లైట్ కలర్ చొక్కాల్ని ధరించటం.. అది కూడా వదులుగా ఉండే చొక్కాల్ని ధరించటం.. మోచేతుల మధ్య వరకు మడవటం కనిపిస్తుంది. చివరకు కాళ్లకు సాదాసీదాలా కనిపించే చెప్పుల్ని వాడేస్తుంటారు.

సింఫుల్ గా కనిపించే ఆయన.. అందుకు భిన్నమైన లుక్ లో ఇజ్రాయిల్ లో కనిపించటం ఆసక్తికరంగా మారింది. తాను బస చేసిన హోటల్ లాబీలో లైట్ కలర్ ఫ్యాంట్ మీద.. వైట్ కలర్ షర్ట్ ను ధరించిన జగన్.. టక్ చేయటం.. స్టైలీష్ బెల్ట్ ను వాడటం.. కాళ్లకు షూస్ వేసుకున్నారు. ఎప్పటిలానే తన మార్క్ అయితే.. ఫుల్ హ్యాండ్ షర్ట్ కబ్స్ ను కాస్త మడిచి పెట్టి అలా వదిలేశారు. చూసినంతనే ఆకట్టుకునే తీరులో ఉన్న జగన్ రూపం అందరిని ఆకర్షిస్తోంది.


Tags:    

Similar News