అడ్డూ అదుపు లేని మృగాళ్లు.. హత్రస్ లో మరో యువతి కిడ్నాప్
ఉత్తరప్రదేశ్లో మృగాళ్ల ఆగడాలు హద్దు మీరాయి. వరుసగా ఆ రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు జరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వారం కిందట జరిగిన మీరట్ గ్యాంగ్ రేప్ ఘటన, రెండ్రోజుల కిందట జరిగిన హత్రస్ గ్యాంగ్ రేప్ 2012లో జరిగిన నిర్భయ ఉదంతాన్ని తలపించాయి. ఈ రెండు ఘటనల్లోనూ కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం చేసి బస్సులో నుంచి తోసేశారు. హత్రాస్ లో దళిత యువతి పై సామూహిక అత్యాచారాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అదే పట్టణం లో తిరిగి ఓ దళిత యువతి కిడ్నాప్ కు గురవడం సంచలనం గా మారింది.
తల్లి, కూతుళ్లు ఓ టెంపోలో ఇంటికి వెళ్తుండగా తల్లి వాటర్ బాటిల్ కోసం బస్సు దిగగా దుండగులు యువతిని కిడ్నాప్ చేశారు. కొన్ని మందుల కొనుగోలు కోసం ఓ గ్రామానికి చెందిన యువతి,ఆమె తల్లి సోమవారం హత్రస్ లోని సదాబాద్ కు వెళ్లారు. తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసి సాయంత్రం ఓ టెంపో వాహనంలో ఇంటికి బయలు దేరారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతి అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. దీంతో ఆమె తల్లి వాహనాన్ని ఆపి వాటర్ బాటిల్ కోసం వెళ్ళింది. ఆమె అలా వెళ్లగానే టెంపో డ్రైవర్,మరో ఇద్దరికి యువతిపై కన్ను పడింది. యువతిని కిడ్నాప్ చేసి అదే వాహనంలో వారు అక్కడినుంచి పరారయ్యారు. అది చూసిన బాధితురాలి తల్లి వెంటనే బంధువులు,పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె ఫిర్యాదుతో టెంపో డ్రైవర్,మరో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ టెంపో ఎటు వెళ్లిందో నిర్ధారించుకుని గాలింపు చేపట్టారు. యూపీ లో వరుసగా జరుగుతున్న అత్యాచారాల పై దేశమంతా అట్టుడుకుతున్న సమయంలో మృగాలు ఏ మాత్రం భయ పడకుండా వరుస గా సామూహిక అత్యాచారాల కు పాల్పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.