‘బాబా కా దాబా’ నా మజాకా..! ట్విట్టర్​ దెబ్బకు పెద్దాయన స్టార్​ తిరిగింది..

Update: 2020-10-09 04:15 GMT
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అలాగే ఒక్క హ్యాష్​ట్యాగ్​ నష్టాల్లో ఉన్న హోటల్​ స్టార్​ను తిప్పేసింది. మూత పడింది.. ఇక ఉపాధి ఎలా అని ఆలోచిస్తున్న వృద్ధదంపతులకు కాసులు కురిపించింది. రెండురోజులుగా ట్విట్టర్​ లో  #Babakadhaba పేరుతో హ్యాష్ ​ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది.  అసలు ఈ దాబా ఎక్కడుంది. దాని కథ ఏమిటో తెలుసుకుందాం. ఢిల్లీలోని మాలవ్య నగర్​ లో ఓ వృద్ధ జంట హోటల్​ ను నడిపిస్తున్నది. వారిద్దరికీ 80 ఏళ్ల  పైనే వయసు ఉంటుంది. ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హోటల్​ నిర్వహిస్తూ వాళ్లు ఉపాధి పొందేవారు. అయితే కరోనా ఎఫెక్ట్​ వారి జీవితాన్ని తలకిందులు చేసింది. లాక్​ డౌన్​ నిబంధనలు సడలించాక హోటల్​ తెరిచారు. అయినా గిరాకీ మాత్రం లేదు. దీంతో ఈ పెద్దాయన ఆవేదనను ఓ యువకుడు తన మొబైల్​లో రికార్డ్​ చేసి సోషల్​ మీడియా లో పోస్ట్​ చేశాడు. ప్రముఖ నటి సోనమ్​ కపూర్​ కూడా ఈ వీడియో ను తన ట్విట్టర్​ ఖాతా లో పోస్ట్​ చేసింది.

 దీంతో ఒక్క రోజులోనే వీడియో వైరల్​ గా మారింది. బాబాకా దాబా పేరు తో ట్విట్టర్​ ఖాతాలు హోరేత్తాయి. ఢిల్లీకి చెందిన వారంతా ఆ హోటల్ ​కు పరుగులు పెట్టారు. కొందరు వ్యక్తిగతంగా  ఆ వృద్ధదంపతులకు సాయం చేసి మానవత్వం చాటుకుంటే.. మరికొందరమే అక్కడ భోజనం చేసి వచ్చారు. ఇలా ఆ హోటల్​ కు ప్రజలు క్యూ కట్టారు. వారికి వండి పెట్టాలంటే తాము 10 మందిని పెట్టుకోవాలని ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు చెబుతున్నారు. అంతేకాక తమ వీడియో ను పోస్ట్​ చేసిన వాళ్లకు, ట్విట్టర్​ కు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. సోషల్ మీడియా పవరంటే ఇదే మరి.  అవసరం అయితే స్టార్ గా మార్చి సాయం చేయగలదు. తప్పు చేస్తే పరువు తీయగలదు.  వివాదాలు సృష్టించ గలదు.
Tags:    

Similar News