బాహుబలి అవతారం ఎత్తిన ముఖ్యమంత్రి

Update: 2017-02-03 04:30 GMT
ఎన్నికల వేళ.. జనాల దృష్టిలో పడేందుకు నేతలు పడే పాట్లు అన్నిఇన్ని కావు. ప్రజల మనసుల్ని దోచుకునేందుకు వారెంతగా తపిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓ రేంజ్లో ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. మిగిలినరాష్ట్రాలకు భిన్నంగా ఉత్తరాఖండ్ లో సాగుతున్న ప్రచారం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ తనను తాను బాహుబలి అవతారం ఎత్తిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమౌళి బాహుబలిలో హీరో భారీ శివలింగాన్ని ఎత్తి తీసుకెళ్లేటప్పడు.. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘ఎవ్వరంట.. ఎవ్వరంట’’ అంటూ హీరో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా పాటను యథాతథంగా వాడేస్తూ బాహుబలి 2 రీతిలో ఒక వీడియోను రూపొందించారు.

ఈ వీడియోలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ఉత్తరాఖండ్ వ్యాప్ ను తన భుజస్కందాల మీద మోస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో బాహుబలి పాటను ఇమిటేట్ చేస్తూ రూపొందించిన పాట ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వీడియోను ముఖ్యమంత్రి రావత్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేయటం గమనార్హం. ఈ వీడియోలో రావత్ ను ఉత్తరాఖండ్ పోరాటయోధుడిగా కీర్తిస్తూ ఉంది. బాహుబలిని ఇలా కూడా వాడుకోవాలన్న ఐడియాను చూసి జక్కన్న కూడా షాక్ తింటారేమో..?   
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News