దుబ్బాక ప్రచారంలో నాన్ లోకల్ నల్గొండ
ఎమ్మెల్యే సోలిపేట ఆకస్మిక మరణంతో అనివార్యమైన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం అంతకంతకూ వేడెక్కుతోంది. ఇప్పటికే లోకల్ - నాన్ లోకల్ అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసిన మంత్రి హరీశ్.. రోజు గడిచే కొద్దీ.. ఈ వాదనను అంతకంతకూ పెంచేస్తున్నారు. నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాక గురించి గులాబీ బాస్ కు తప్పించి.. ఇంకెవరికైనా తెలుసా?అన్న ఆయన.. ఈ రోజున టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించే నల్గొండ జిల్లాను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నుంచి కిరాయి జనరేటర్.. కిరాయి సౌండ్ తెచ్చుకునే దుస్థితిలోకి పార్టీ మారిందని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహాం వ్యక్తం చేసిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉత్తమ్ దుబ్బాకకు వచ్చారా? అని ప్రశ్నించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూత్ తో బైక్ ర్యాలీ ఏర్పాటు చేస్తే.. భారీ స్పందన రావటంపై హర్షం వ్యక్తం చేశారు. 200 మందితో బైక్ ర్యాలీ పెట్టుకుంటే వెయ్యి బైకులు వచ్చాయని.. ఇదొక్కటి చాలు యూత్ ఎవరివైపు ఉన్నారో తెలుసుకోవటానికి అని పేర్కొన్నారు.
బరిలో నిలిచిన కాంగ్రెస్.. బీజేపీలపై భారీ ఎత్తున విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్.. బీజేపీ వాళ్లంతా పరాయి లీడర్లు.. కిరాయి మనుషులేనంటూ మండిపడ్డారు. ‘వాళ్లంతా వచ్చి మన పెట్రోలు బంకులు.. చాయి హోటళ్లు.. కిరాణా దుకాణాలకు ఇంత గిరాకీ చేసి పోతారు. పోయేటప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టులు చేసిన వెళతారని.. అలా అయినా వాళ్ల జీవితం ధన్యమవుతుందన్నారు. 2001 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో అయినా దుబ్బాకలో గులాబీ జెండానే ఎగిరిందని.. టీఆర్ఎస్ కు కంచుకోటగా అభివర్ణించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ దే పైచేయి అన్నది నిజమే. మరి.. ఇంత భారీగా సెంటిమెంట్ ను టచ్ చేయాల్సిన అవసరం ఏముందన్నది అసలు ప్రశ్న.