'మై నేమ్‌ ఈజ్‌ 420 ' ..దొంగ దొరికాడు !

Update: 2020-07-04 05:45 GMT
గుంటూరులో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఇప్పటికే ప్రధాన సూత్రధారి వరుణ్‌ తోపాటు వాటిని వెబ్‌ సైట్‌ లో అప్‌ లోడ్ చేసిన కౌశిక్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  “మై నేమ్‌ ఈజ్‌ 420’ అనే ఇన్ ‌స్ట్రాగామ్‌ ఐడీపై విద్యార్థిని నగ్న చిత్రాలను అప్‌ లోడ్‌ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని చదివిన కళాశాలలోనే చదివిన విద్యార్థికి ఈ వీడియోలు, చిత్రాలు అందాయి.

ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన యువకుడు వాటిని మరో నలుగురికి పంపినట్టు సమాచారం. దీంతో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితోపాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫొటోలు అందుకున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. అలాగే  ఆ ఫోటోలు ఎక్కడ నుంచి అతడికి వచ్చాయి అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే ,  వీడియో తీసుకున్న విద్యార్థి సదురు విద్యార్థిని ని బెదిరించి నగదు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
Tags:    

Similar News