ట్రంప్ స్టేట్మెంట్ తో పెట్రోల్ బంకుల్లో క్యూ !

ఇరాన్ తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో అంతకాలం హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసి ఉంటుంది. దాంతో ముడి చమురు అన్నది భారత్ లాంటి దేశాలకు అందకుండా పోతుంది.;

Update: 2026-03-03 18:06 GMT

పశ్చిమాసియాలో తీవ్ర అలజడి యుద్ధం కాదు కానీ భారత్ లో ఇపుడు ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్ తన దేశం గుండా సాగే హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దేశాలు కలిసి దాడి చేస్తున్న నేపధ్యంలో ఇరాన్ దేశం హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తీవ్రమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతోనే ఇరాన్ ఈ డెసిషన్ కి వచ్చింది అని అంటున్నారు.

ఎంతో కీలకమైన జల సంధి :

ఇదిలా ఉంటే హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. భారత్ వరకూ చూస్తే ముడి చమురు తెచ్చుకునే మార్గాలు అయితే మూసుకుని పోయాయని అంటున్నారు. అసలు హార్మూజ్ జలసంధికి ఎందుకు అంత ప్రాధాన్యత అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ జలసంధి ఎంతో కీలకంగా ఎందుకు మారిందంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇంఫర్మేషన్ ఉంది.

హర్మూజ్ జలసంధి ఇంపార్టెంట్ :

ఎందుకు అంటే హర్మూజ్ జలసంధి ఇరాన్ దక్షిణ తీరంలో అలాగే ఒమన్ ఉత్తర తీరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉన్న ఇరుకైన నీటి మార్గంగా చెప్పాల్సి ఉంది. . జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్ అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. ఇక పెర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నవి అన్నీ చమురు నిల్వలే. ఇవన్నీ కూడా చమురుని ప్రపంచంలోని అనేక ప్రదేశాలకు నిరంతరం తీసుకుని వెళ్తాయి. వీటికి ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే హర్మూజ్ జలసంధి మాత్రమే. ఏడాది పొద్దూ మూడు వందల అరవై అయిదు రోజులూ హర్మూజ్ జలసంధి ఫుల్ ట్రాఫిక్ తో ఉంటుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సగానికి పీగా ఇక్కడ నుంచే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, అలాగే కువైట్ వంటి గల్ఫ్ ఉత్పత్తిదారులకు హర్మూజ్ జలసంధి అతి కీలకమైన ప్రాంతంగా ఉంది.

యుద్ధం జరిగితే అంతే :

ఇరాన్ తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో అంతకాలం హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసి ఉంటుంది. దాంతో ముడి చమురు అన్నది భారత్ లాంటి దేశాలకు అందకుండా పోతుంది. ఈ నేపధ్యంలో పెట్రోల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయని అంటున్నారు. తాజాగా చూస్తే ట్రంప్ చేసిన ప్రకటన దేశంలో వాహన వినియోగదారులలో కలవరం పుట్టించింది. నెల రోజులకు పైగా యుద్ధం సాగుతుంది అని ఆయన ప్రకటించాడు. దాంతో పెట్రోల్ ధరలు దేశంలో పెరిగిపోతాయని ఆందోళన పెరిగింది. అంతే కాదు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు,ఇతర వస్తువులపై పరోక్షంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు.

క్యూలు కట్టేస్తున్నారు :

రేపో మాపో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా తారస్థాయికి పెంచేస్తారు అని వార్తలు రావడంతో దేశంలో చాలా చోట్ల జనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతూ కనిపిస్తున్నారు. అంతే కాదు ఫుల్ ట్యాంక్ ని కొట్టించేసుకోవడమే కాకుండా తమ వెంట తెచ్చిన బాటిల్స్ లో సైతం పెట్రోల్ ని కొట్టించుకుని తీసుకెళ్తున్నారు. ఇదంతా సేఫ్ జోన్ లో భాగమే అని అంటున్నారు. అయితే భారత ప్రభుత్వం వద్ద మరో 40 రోజులకు సరిపడా చమురు ఉందని అంటున్నారు. దాంతో నెల రోజులు పాటు ఏ ఢోకా లేదని ఇప్పట్లో పెట్రోలు ధరలు పెరగవని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పశ్చిమాసియాలో యుద్ధం భారత్ ని ఇబ్బంది పెట్టేలా ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆందోళన పెంచేలా ఉంది అని అంటున్నారు. పరస్పర ఆధారభూతమైన ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా అందరూ ఫలితాలను అనుభవించాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News