కొత్త వివాదం : ప్రధాని వివరాలు అడిగితే ఫైన్ వేస్తారా ?

Update: 2023-04-01 10:13 GMT
కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీపై అనర్హత వేటుతో విమర్శల పాలవుతున్న నరేంద్రమోడీపై మరో వివాదం కమ్ముకున్నది. నరేంద్రమోడీ విద్యార్హత వివరాలను చెప్పాలని అడిగినందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రు. 25 వేలు ఫైన్ వేయటం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ప్రజాప్రతినిధులకు విద్యార్హతలతో పనిలేదు. పలానా విద్యార్హత ఉన్న వాళ్ళే పలానా స్ధానానికి పోటీచేయాలనే నిబంధన ఏమీలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్హతలు అవసరం కాని పాలకులకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు.

అయితే అప్పుడప్పుడు కొందరి విద్యార్హతలు వివాదాస్పదమవుతుంటాయి. కొందరు ప్రజాప్రతినిధులు గొప్పలకు పోయి తమ అసలు విద్యార్ధతకన్నా ఎక్కువగా చెప్పుకుంటారు. చెప్పుకోవటమే కాకుండా ఎన్నికల్లో పోటీచేసేటపుడు దాఖలు చేయాల్సిన అఫిడవిట్లో కూడా అలాగే రాస్తారు.

దీంతోనే వివాదాలు బయటపడతాయి. ఇపుడు మోడీ తాను ఏమి చదువుకున్నారని చెప్పారో ఎన్నికల అఫిడవిట్లో ఏమి రాశారో తెలీదు. 1978లో డిగ్రీ చదువుకున్నారని, 1983లో ఢిల్లీ యూనివర్సిటిలో పీజీ చేసినట్లు అఫిడవిట్లో ఉందని ప్రచారం మొదలైంది.

అయితే మోడీ ఇవేమీ చదవకుండానే చదివినట్లు అఫిడవిట్లో ఎలా చెప్పారనే వివాదం  మొదలైంది. ఈ నేపధ్యంలోనే వాస్తవాలు తెలుసుకునేందుకు కేజ్రీవాల్ ఆర్టీఐ చట్టం కింద మోడీ విద్యార్హతలు చెప్పాలని దరఖాస్తు చేశారు.

దానిపైన గుజరాత్ హైకోర్టు స్పందనే విచిత్రంగా ఉంది. మోడీ విద్యార్హతలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే విద్యార్హతలు తెలుసుకోవాలని అనుకున్న కేజ్రీవాల్ కు రు. 25 వేలు ఫైన్ వేయటమే వివాదాస్పదమైంది.

మోడీ వివరాలు అడిగితే ఫైన్ వేసేస్తారా అంటు ప్రతిపక్షాల నేతలు ఆశ్చర్యపోతున్నారు. వివరాలు ఇవ్వక్కర్లేదు అని చెప్పటం వరకు ఓకేనే కానీ ఫైన్ వేయటం పైనే అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రతిపక్షాల విషయంలో మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేందుకు తాజా ఘటనే నిదర్శనమంటు ప్రతిపక్షాలు గోలచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలనే పట్టుకుని బీజేపీ నేతలు ప్రతిపక్షాలను నేతలను గతంలో టార్గెట్ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అప్పట్లో కోర్టులో జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News