టీపీసీసీలో కరోనా కలకలం.. ఆయనకు వైరస్

Update: 2020-06-17 11:30 GMT
కరోనా వైరస్ తెలంగాణలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. సామాన్యుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూనే ఉంది.

తాజాగా తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా కలవరపరుస్తోంది. వరుసగా ముగ్గురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో తెలంగాణలో ప్రజాప్రతినిధులంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

తాజాగా టీపీసీసీలోనూ కరోనా కలకలం మొదలైంది. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే కాంటినెంటల్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.

నారాయణరెడ్డికి వైరస్ పరీక్షలు చేయగా లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఒళ్లు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Tags:    

Similar News