జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 10 కౌంట్ డౌన్ ప్రారంభం ...విప్లవాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం !

Update: 2021-08-11 09:30 GMT
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో ఘనతకు శ్రీకారం చుట్టబోతుంది. జీఎస్‌ ఎల్వీ-ఎఫ్‌ 10 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన తర్వాత గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ ఎల్‌ వీ వాహకనౌక నింగిలోనికి దూసుకెళ్లనుంది.

దీని ద్వారా 2,268 కిలోల బరువు ఉన్న జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూ పరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది. భూపరిశీలన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్- F10 పేరుతో ఈ శాటిలైట్‌ ను నింగిలోకి పంపనుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్నారు.

EOS-03 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం, దీనిని GSLV-F10 ద్వారా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌ లో ఉంచుతారు. తదనంతరం, ఉపగ్రహం దాని ఆన్‌ బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ ని ఉపయోగించి తుది జియోస్టేషనరీ కక్ష్యకు చేరుకుంటుంది. ఈ GSLV వాహననౌకలో మొదటిసారిగా ఫెయిరింగ్ కోసం నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన ఓగివ్ ఆకారపు పేలోడ్ ఫెయిరింగ్ ఎగురుతోంది. ఇది జిఎస్‌ ఎల్‌ వి యొక్క పద్నాలుగో వాహక నౌక కావడం గమనార్హం. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఇది 79వ ప్రయోగం.

కరోనా ప్రభావం వల్ల శ్రీహరికోటలో రాకెట్ల ప్రయోగాలు స్తంభించిపోయాయి. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి మిషన్‌ను చేపట్టింది. దాన్ని విజయవంతం చేసింది. పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ఏడాది కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత వల్ల చేపట్టదలిచిన ప్రయోగాల్లో కూడా జాప్యం నెలకొంది. పరిస్థితులు అనుకూలించడంతో జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ ను మిషన్‌ను టేకప్ చేసింది. దాన్ని పూర్తి చేసింది. గురువారం తెల్లవారు జామున 5:43 నిమిషాలకు దాన్ని అంతరిక్షంలోకి పంపించబోతోంది. దీన్ని విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తోన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధా కేంద్రంలోని సెకెండ్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ జీఎస్‌ ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 ప్రయోగానికి కౌంట్‌ డౌన్ ఆరంభించింది.



Tags:    

Similar News