గ్రేటర్‌ పరిధిలో 40 లక్షల ఓటర్లు కనిపించటం లేదట

Update: 2015-07-08 05:13 GMT
ఆధార్‌కార్డుకు ఓటర్ల జాబితాను లింకు చేద్దామని ప్రయత్నించి అధికారులు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పరిస్థితి. దేశంలో మరెక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆధార్‌ కార్డులకు.. ఓటర్ల జాబితాకు లింకు చేయటానికి  ప్రయత్నిస్తే ఒక పట్టాన సాధ్యం కాని పరిస్థితి.

మొత్తం ఓటర్ల జాబితాలో ఉన్న కోటిన్నర ఓట్ల వరకూ ఆధార్‌తో లింకు కాని పరిస్థితి. దీంతో ఏం అర్థకాని ఎన్నికల సంఘం ఏదైనా తప్పు దొర్లిందేమోనన్న భావనతో మరోసారి తనిఖీ చేపట్టి.. ఒకవేళ ఆధార్‌లో పేర్కొన్నట్లుగా ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించని పక్షంలో వారి పేర్లను తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఆధార్‌కు.. ఓటర్ల జాబితాకు లింకు దొరకని ఓటర్లలో ఒక్క గ్రేటర్‌ పరిధిలో (హైదరాబాద్‌.. రంగారెడ్డి జిల్లాలోనే) దాదాపు 40 లక్షల ఓటర్లు కనిపించటం లేదని చెబుతున్నారు. మరికొందరు ఓటర్ల పేర్లు.. ఆధార్‌ పేర్లు సరిపోయినా.. చిరునామాల్లో తేడాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇంత భారీ స్థాయిలో ఓటర్లు బోగస్‌ అని తేలిస్తే.. రానున్న ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. మరి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆధార్‌తో లింకు కాని ఓటర్ల విషయంలో ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News