తాత చిందులు.. కర్రతో వచ్చిన బామ్మ : వైరల్ వీడియో !

Update: 2021-01-28 10:58 GMT
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరుచూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. భారత జట్టుకు విజయాలను అందించడంలో వీరేంద్ర సెహ్వాగ్ పాత్ర కూడా ఎంతో కీలకం అని చెప్పాలి.  అయితే ఇక భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రోజుల పాటు అద్భుతంగా రాణించిన ఎన్నో చిరస్మరణీయ విజయలన్ని అందించారు. తాజాగా ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ పంచుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పెళ్లి వేడుకలో భాగంగా ఓ తాత డీజేలో వస్తున్న పాటకు కుర్రాళ్లతో సమానంగా చిందేలేస్తుంటాడు.

అలా పెళ్లి డీజేలో డ్యాన్స్‌ చేస్తున్న ఆ తాత దగ్గరికి అతడి భార్య ఆకస్మాత్తుగా చేతి కర్రతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఫుల్‌ జోష్ ‌తో డ్యాన్స్ చేస్తున్న ఆ వృద్దుడు ఆమెను చూడగానే హడలేత్తిపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ వీడియోని వీరూ తన ఇన్‌ స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'వయసు శాశ్వతం కాదు.. కానీ భార్య చేతి కర్ర మాత్రం శాశ్వతం' క్యాప్షన్‌ ఇచ్చాడు.

దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.  క్రికెట్ కి  రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ,  తన చలోక్తులకు మాత్రం ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఏ అంశంపైన అయినా సరే తన దైన శైలిలోస్పందిస్తూ జోకులు పేలుస్తూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. కాగా ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

Full View
Tags:    

Similar News