• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్‌ కు చుక్కలు...

కేసీఆర్‌ కు చుక్కలు చూపిస్తున్న గవర్నరు

By - Tupaki Desk
Update: 2019-10-23 14:30 GMT
తెలంగాణ గవర్నరు తమిళసై స్పీడుకు సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. ఆమె తెలంగాన గవర్నరుగా పదవి చేపట్టిన కొద్దిరోజుల్లోనే యాక్టివ్‌గా వ్యవహరిస్తూ వివిధ శాఖలతో సమీక్షించారు. అంతేకాదు... ఆర్టీసీ సమ్మె విషయంలోనూ రవాణా శాఖ మంత్రి, అధికారులను పిలిచి పరిస్థితులు తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలిచ్చారు.

ఇప్పుడామె చేపట్టనున్న మరో కార్యక్రమం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోతోంది. గిరిజన గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని ఆమె తలపోస్తున్నారు. దీంతో అక్కడి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు అన్నీ బయపడబోతున్నాయి.

గిరిజన సంక్షేమ శాఖతో చేపట్టిన ఓ సమీక్ష కార్యక్రమంలో గవర్నరు ఈ మేరకు తన ఆకాంక్షను బయటపెట్టారు. తాను వైద్యాధికారిగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లో వారితో పాటే ఉన్నానని.. అక్కడే ఉంటూ వారికి వైద్య సేవలందించానని ఆమె చెప్పారు. గిరిజనుల మధ్యే ఉంటూ వారి సంస్కృతి, సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కారాలు అందించగలమని ఆమె అన్నారు.

నిజానికి గవర్నరు వివిధ శాఖలతో సమీక్షలు చేపట్టినప్పుడే ప్రభుత్వానికి సెగ మొదలైంది. ఇప్పుడామె మరింత ముందుకెళ్లి ప్రజల మధ్యకు వెళ్తానంటుండడంతో సీఎం, మంత్రులు సిగ్గు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల్లోకి వెళ్లడంతగ్గిపోయింది. ఆయన సెక్రటేరియట్‌కు కూడా రాకుండా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా పేరుపడ్డారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా ఆయన మంత్రులూ ఎప్పుడో ప్రజలున మర్చిపోయారు. అలాంటి సమయంలో గవర్నరు ప్రజల్లోకి వెళ్తానంటుండడం సీఎం, మంత్రులను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు గవర్నరు సీఎంను నామమాత్రం చేసి పాలన సాగించే దిశగా అడుగులేస్తున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
Tags:    
  • Governor 
  • Shock 
  • KCR 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS