ప‌ట్ట‌ణాల్లో ఇళ్ల కొర‌త‌కు కేంద్రం చెక్!

Update: 2018-04-10 12:24 GMT
ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో న‌గ‌రాలు - ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వెళ్లే వారి సంఖ్య నానాటికీ ఎక్కువైపోతోంది. ఏటా పెరిగిపోతోన్న జ‌నాభాకు స‌రిపడా ఇళ్లు లేక‌పోవ‌డంతో ప‌ట్ట‌ణాల్లో నివాస గృహాల‌కు కొర‌త ఏర్ప‌డింది. అయితే, ప‌ట్ట‌ణాల్లో ఉన్న జ‌నాభాకు స‌రిపడా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో, ప‌ట్ట‌ణాల్లో ఇళ్ల‌ కొర‌త‌ను తీర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌రికొత్త విధానాన్నిప్ర‌వేశ‌పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. అద్దెకుండే వాళ్లకి...ఇంటి యజమానులకు ఆమోద‌యోగ్యంగా ఉండేలా జాతీయ పట్టణ ప్రాంత ఇళ్ల అద్దె విధానం (ఎన్‌ యూఆర్‌ హెచ్‌ పీ) ను కేంద్రం రూపొందించింది. పట్టణాల్లో నిరుపయోగంగా ఉన్న‌ గృహాల‌ను....అద్దెకు ఇచ్చేలా ఈ విధానం ఉంటుంది. ఖాళీగా - నిరుప‌యోగంగా ఉన్న ఇళ్ల‌ను యజమానులు...అద్దెకు ఇచ్చేలా ఆ విధానం ప్రోత్స‌హిస్తుంది. ప్రధాని మోడీ "2022 కల్లా అందరికీ ఇళ్లు" అనే నినాదాన్నిచ్చారు. అందులో భాగంగానే ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. పట్టణ జ‌నాభాలో 27.5 శాతం మంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే, పట్టణాల్లో 1.11 కోట్లు ఇళ్లు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో, ఆ రెండింటిన అనుసంధానం చేసేలా కేంద్ర ఈ విధానాన్ని రూపొందించింది. ఆ రెండింటిన బ్యాలెన్స్ చేసి ప్ర‌జ‌లు ఉండేందుకు ఇంటిని స‌మ‌కూర్చాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. దీంతో, 2022 నాటికి అంద‌రికీ ఇళ్ల నినాదాన్ని నిజం చేయాల‌ని చూస్తోంది.

నేషనల్ అర్భన్ రెంటల్ హౌసింగ్ పాలసీ(ఎన్‌ యూఆర్‌ హెచ్‌ పీ) విధానం ప్ర‌కారం అద్దెకుండేవారి - య‌జ‌మానులకు ...ఇద్ద‌రికీ ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ విధానం వ‌ల్ల యజమానులను ఇష్టానికి వ్యతిరేకంగా అద్దెకు ఉండేవారు,  ఇష్టమొచ్చినట్లు ఇళ్లు ఖాళీ చేయించే య‌జ‌మానులు ...నియంత్ర‌ణ‌లో ఉంటారు. ఈ విధానానికి కేంద్ర మంత్రిమండలి త్వరలోనే ఆమోదం తెల‌ప‌నుందని తెలుస్తోంది. ఇళ్ల అద్దె - భూమి వ్య‌వ‌హారాలు రాష్ట్ర పరిధిలోని అంశాలు. అయితే, "2022 కల్లా అందరికీ ఇళ్లు" అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల‌తో కేంద్రం క‌ల‌వ‌నుంది. ఈ విధానం వ‌ల్ల కొత్త వ్యాపారావకాశాలు వ‌స్తాయ‌ని అంచ‌నా. ఈ విధానం వల్ల కొత్తగా `అద్దె నిర్వహణ సంస్థలు` రంగ ప్ర‌వేశం చేసే అవ‌కాశముంది.

ఎన్‌ యూఆర్‌ హెచ్‌ పీ విధానాన్ని 3 కేట‌గిరీలుగా విభ‌జించారు. ఎస్సీ - ఎస్టీ - ఓబీసీ - వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చేలా "సామాజిక అద్దె విధానం(ఎస్ ఆర్‌ హెచ్)`` ఉంటుంది. మురికి వాడ‌ల్లో తాత్కాలిక నివాసాలలో ఉన్న వారికి ఇది వ‌ర్తిస్తుంది. "మార్కెట్‌ ఆధారిత అద్దె విధానం(ఎంఆర్‌ హెచ్‌)`` కేట‌గిరీలో విద్యార్థులు - ప్రొషెషనల్స్ - ప్రభుత్వోద్యోగులకు అనువైన అద్దె ఇల్లు దొరుకుతుంది. మొదటి రెండు విభాగాల్లోకి రాని మిగ‌తావారు ప్రైవేటు అద్దె విధానం(పీఆర్‌ హెచ్) కేట‌గిరీలోకి వ‌స్తారు.


Tags:    

Similar News