పండుగపూట ఉద్యోగుల జీతాల తిప్పలు: 7 జిల్లాల వారికే జమ..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరాల ముందు కూడా చాలా మందికి ఇప్పటికీ జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా తమ ఖాతాల్లో పడుతున్నాయి. అయితే ప్రభుత్వం అప్పట్లో కరోనా కారణంగా రాబడి లేనందున జీతాలు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. అయితే ఇప్పుడు కరోనా సమస్య లేకపోవడంతో పాటు ఆదాయం వస్తున్నా సమయానికి సాలరీ పడడం లేదని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరా ముందు కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పండుగ పూట అవే తిప్పలు పడుతున్నామని అంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రతీనెలా ఆలస్యంగానే వస్తున్నాయి. అయితే పండుగ సందర్భంగా ఈసారైనా ఒకటో తేదీన పడుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఇప్పటి వరకు జీతాలు, పెన్షన్లు పడలేదనంటున్నారు. అయితే కొన్ని జిల్లాల ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం ఒకటో తేదీనే చెల్లింపులు చేసింది. వాటిలో కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల్లో సోమవారమే జీతాలు జమ అయ్యాయి. మిగతా 26 జిల్లాలకు చెందిన వారిలో ఇప్పటి వరకు అకౌంట్లలో డబ్బులు పడలేదు. దీంతో తమకు ఎప్పుడు పడుతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
జీతాల చెల్లింపుపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు ఏ తేదీన పడుతాయో తెలియని పరిస్థితి ఎదురైందని అంటున్నారు. కొందరికి వాయిదా చెల్లింపులు, నెలవారీ అద్దెలతో పాటు ఇతర చెల్లింపులు చేసుకోవాల్సి ఉంది. ఇలా జీతాలు జమ అయ్యే తేదీ తెలియకపోవడంతో తమ వాయిదాల విషయంలో ఆందోళన చెందాల్సి వస్తోందని అంటున్నారు. ఫలానా తేదీ అని చెబితే తమ వాయిదాల తేదీలను మార్పు చేసుకుంటామని కొందరు ఉద్యోగ సంఘా నేతలు అంటున్నారు.
ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈసారి జీతాలు ముందుగా వస్తాయని అనుకున్నామని, అయితే ప్రభుత్వం ఈసారి కూడాపట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో పండుగను ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పండుగ సందర్భంగా అనేక ఖర్చులు ఉంటాయని, ప్రభుత్వం జీతాలు సరైన సమయానికి వేస్తే వాటిని ఉపయోగించుకుంటామని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 7 జిల్లాలకు చెల్లించి మిగతా వారికి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల స్కూళ్లు, కాలేజీలు ఇప్పుడే మొదలయ్యాయి. ఈ సందర్భంలో ఫీజులు కట్టాలని విద్యాసంస్థలు ఫోర్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో తాము ఫీజుల కట్టకపోతే పిల్లల చదువులపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు అప్పులు చేసిన వారున్నారు. వాటికి వడ్డీలు కట్టేందుకు కూడా చేతిలో నగదు లేకపోవడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. కొందరు వేతన జీవులు నెలవారీ జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇలా నెలనెలా జాప్యం చేయడం వల్ల ఇంటి అవరసరాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.
30 ఏళ్లుగా ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు చెల్లించిందని, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే కొందరు ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రభత్వంతో పీఆర్సీ విషయంలో చాలా ఆందోళనలు చేశామని, ప్రభుత్వం ఉద్యోగులు అనుకున్నదానికంటే ఎక్కువే పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పడు వివాదం పెట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం తమకు సరైన సమయంలో జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.